ఇటీవలే జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో టీ20ల్లో గెలిచిన భారత్.. వన్డే, టెస్టు సిరీస్‌ల్లో ఓడింది. కెప్టెన్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్క అర్ధశతకం మాత్రమే చేశాడు. దీంతో పలువురు విశ్లేషకులు కోహ్లీని విమర్శించారు. అతడు మైదానంలో వ్యవహరించే తీరు మార్చుకోవాలని సూచించారు. క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ మాత్రం దీనిపై అడ్డుచెప్పాడు. కోహ్లీ తీరు మారాల్సిన అవసరం లేదని అన్నాడు.
"కెప్టెన్ అంటే దూకుడుగా ఉండాలని మీరే అంటారు. అలా చేస్తే విమర్శిస్తారు. మైదానంలో కోహ్లీ తీరు నాకు నచ్చుతుంది. అతడు గంగూలీ స్కూల్‌కు చెందినవాడు. వారికి స్వదేశం, విదేశం అనే తేడా ఉండదు. ఎప్పుడు ఒకేలా ఆడతారు. ఉత్తమ బ్యాట్స్‌మన్ కొన్నిసార్లు ఫామ్ కోల్పోతారు. అంతమాత్రాన వారికి తక్కువ చేయడం సరికాదు. కోహ్లీనే చూసుకుంటే ఇటీవల కాలంలో విఫలమైనా సరే నం.1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు"
-మదన్‌లాల్, సీఏసీ సభ్యుడు
ధోని భవిష్యత్ గురించి ప్రశ్నించగా.. జట్టులో అతడిని ఎంపిక చేసే విషయం సెలెక్టర్లు చూసుకుంటారని మదన్‌లాల్ అన్నాడు. తనకు దాని గురించి తెలియదని చెప్పాడు.
ఇదీ చూడండి.. ఝార్ఖండ్ వీధుల్లో ధోనీ రయ్ రయ్