ETV Bharat / sports

రోహిత్ లేడు.. మరి ఓపెనింగ్ స్థానం ఎవరిది? - rohit latest news

ఆస్ట్రేలియా పర్యటనలోని పరమిత ఓవర్ల సిరీస్​లో రోహిత్ శర్మ అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో అతడి ఓపెనింగ్ స్థానంలో బరిలో దిగే ఆటగాడు ఎవరు?

who will be seen in rohit sharma opening place in australia series?
రోహిత్ లేడు.. మరి అతడి స్థానం ఎవరిది?
author img

By

Published : Nov 22, 2020, 10:18 AM IST

రోహిత్‌శర్మ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు వెన్నెముక. గత కొన్నేళ్లుగా వన్డే, టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఓపెనర్‌.. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. మరి హిట్‌మ్యాన్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఆసీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా ఆడే ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో (మూడేసి వన్డే, టీ20లు) శిఖర్‌ ధావన్‌తో పాటు ఓపెనర్‌గా బరిలో నిలిచేదెవరు? రోహిత్‌ లేకపోయినా మేమున్నాం అంటున్నారు కొంతమంది కుర్రాళ్లు.. మరి ఈ రేసులో ఉన్న వాళ్లెవరో చూద్దామా!

కేఎల్‌ రాహుల్‌ మరోసారి..

2016లో భారత్‌ జట్టుకు అరంగేట్రం చేసిన నాటి నుంచి కేఎల్‌ రాహుల్‌ భిన్నమైన పాత్రలు పోషించాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా సేవలందించాడు. కెప్టెన్‌ కోహ్లీ కోరుకున్న పాత్రల్లో ఒదిగిపోయాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్‌శర్మ గైర్హాజరు నేపథ్యంలో పరిమిత ఓవర్ల జట్టుకు వైస్‌ కెప్టెన్‌గానూ అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. గత న్యూజిలాండ్‌ సిరీస్‌లో మిడిలార్డర్‌లో వచ్చి సత్తా చాటిన రాహుల్‌.. రోహిత్‌ లేకపోవడం వల్ల ఇప్పుడు మరోసారి ఓపెనర్‌గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సారి ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఓపెనర్‌గా దుమ్మురేపి అత్యధిక పరుగుల వీరుడిగా (14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు) ఆరెంజ్‌ టోపీని అందుకున్న కేఎల్‌.. రోహిత్‌ స్థానాన్ని భర్తీ చేసే రేసులో అందరికంటే ముందున్నాడు.

kl rahul
రోహిత్ శర్మతో కేఎల్ రాహుల్

శుభ్‌మన్‌ గిల్‌కూ ఛాన్సుంది

స్థిరత్వం, దూకుడు, టెక్నిక్‌ కలబోసిన ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌. భారత్‌-ఎ జట్టుకు రెగ్యులర్‌ ఓపెనర్‌ అయిన ఈ కుర్రాడు.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఓపెనింగ్‌కు దిగి 14 మ్యాచ్‌ల్లో 33.84 సగటుతో 440 పరుగులు చేశాడు. ఈ సీజన్లో స్థిరంగా రాణించిన ఈ కుడి చేతివాటం బ్యాట్స్‌మన్‌ మూడు అర్ధసెంచరీలు సాధించాడు. గతేడాది న్యూజిలాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన 21 ఏళ్ల శుభ్‌మన్‌.. ఈ సిరీస్‌లో రెండే మ్యాచ్‌లు ఆడి 16 పరుగులే చేశాడు. కానీ మళ్లీ ఫామ్‌ అందుకున్న అతను రోహిత్‌ గైర్హాజరు నేపథ్యంలో ఓపెనింగ్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పృథ్వీ షాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా విమానం ఎక్కిన గిల్‌ ఇక్కడ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరం.

subman gill
శుభ్​మన్ గిల్

వన్డేలు, టీ20లూ ఆడగల మయాంక్‌..

టెస్టుల్లో ఓపెనర్‌గా ఇప్పటికే సత్తా చాటాడు మయాంక్‌ అగర్వాల్‌. అయితే తనలో వన్డే, టీ20లకు కావాల్సిన దూకుడు ఉందని తాజాగా ఐపీఎల్‌లో అతను నిరూపించుకున్నాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున రాహుల్‌తో పాటు ఓపెనర్​గా దిగిన మయాంక్‌ (11 మ్యాచ్‌ల్లో 424 పరుగులు) ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లను అభిమానులు మరిచిపోలేరు. ఈ టోర్నీలో ఓ సెంచరీ కూడా బాదాడతను. 2019-20 కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓపెనర్‌గా దిగి మయాంక్‌ ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌లు ఆడి అతను చేసింది 36 పరుగులే. రోహిత్‌ లేని నేపథ్యంలో మళ్లీ మయాంక్‌ రేసులోకి వచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటేందుకు సై అంటున్నాడు.

mayank agarwal
మయాంక్ అగర్వాల్

సంజు శాంసన్‌ ప్రత్యామ్నాయం..

సంజు శాంసన్‌.. టీ20ల్లో తన దూకుడుతో ఆకట్టుకున్న బ్యాట్స్‌మన్‌. ఇటీవల ఐపీఎల్‌లోనూ రాజస్థాన్‌ రాయల్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. క్లీన్‌ హిట్టింగ్‌తో ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌.. ఒకటి రెండు మ్యాచ్‌ల స్వరూపాన్ని మార్చే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటిదాకా నాలుగు టీ20లు ఆడినా రాణించలేకపోయిన సంజు.. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే అతను సత్తా చాటేందుకు ఆస్ట్రేలియా పర్యటన మంచి వేదిక కానుంది. రోహిత్‌ లేని నేపథ్యంలో అతనో మంచి ఓపెనింగ్‌ అవకాశం. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 24 మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ చేసి 23.29 సగటుతో 559 పరుగులు చేశాడీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌.

sansju samson
సంజూ శాంసన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.