విరాట్ కోహ్లీ.. టీమిండియా సారథిగానే కాక తన అల్లరి చేష్టలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత శతకంతో జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం చాహల్ టీవీలో మాట్లాడిన కోహ్లీ.. తన ఫిట్నెస్, ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గల కారణాలు వివరించాడు.
"నా మనస్తత్వం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది. గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తా. అలాగే ప్రతి ఆటగాడు విజయం కోసం వంద శాతం కృషి చేయాలి. లేదంటే జట్టుకు న్యాయం చేయలేం. జీవనశైలి, కసరత్తులు, కఠినమైన ఆహార నియమాలు సరైన రీతిలో పాటించడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలుగుతాను". -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
60-65 పరుగుల వద్ద ఉన్నపుడు కాస్త ఒత్తిడికి గురయ్యానని, కానీ ఆ సమయంలో తను స్థిరంగా బ్యాటింగ్ చేయడం జట్టుకు అవసరమని తెలిపాడు కోహ్లీ.
"60-65 పరుగులకు చేరువవుతున్నపుడు ఒత్తిడికి గురయ్యా. కానీ అప్పుడు నేను స్థిరంగా బ్యాటింగ్ చేయడం అవసరం. నిజంగా జట్టు గురించి ఆలోచిస్తే ఒత్తిడి, అలసట అన్ని మర్చిపోతాం" -కోహ్లీ, టీమిండియా సారథి
విండీస్‌తో మొదటి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. ఆ సమయంలో గేల్, మైదాన సిబ్బందితో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు కోహ్లీ. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శతకం బాదాడు. ఫీల్డింగ్‌లో ఎవిన్ లూయిస్ క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టి ఔరా అనిపించాడు.
"ఫీల్డింగ్‌ను ఎంజాయ్ చేస్తా. దేవుడు నాకు ఇంత మంచి జీవితాన్ని, ఈ దేశానికి ఆడే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ క్షణాల్ని ఆస్వాదించడం ముఖ్యం. మైదానంలో సంగీతం వస్తున్నపుడు డ్యాన్స్ చేయాలనిపించింది. ఎప్పుడు మ్యూజిక్ వినిపించినా నేను డ్యాన్స్ చేస్తా".
-కోహ్లీ, టీమిండియా సారథి
ప్రపంచకప్‌లో ఒక్క శతకమైనా చేయని కోహ్లీ.. ప్రతిసారీ 60-70 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే విండీస్ టూర్‌లోని రెండో వన్డేలో సెంచరీతో సత్తాచాటాడు విరాట్.
-
MUST WATCH: Chahal TV returns with #KingKohli 😄😎
— BCCI (@BCCI) August 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
From @imVkohli's record 42 ton to his dance moves 🕺🕺, @yuzi_chahal makes a smashing debut in the Caribbean. By @28anand #TeamIndia #WIvIND
Full video here 📽️📽️ https://t.co/Cql7RCoaw1 pic.twitter.com/CCQu6dDRJA
">MUST WATCH: Chahal TV returns with #KingKohli 😄😎
— BCCI (@BCCI) August 12, 2019
From @imVkohli's record 42 ton to his dance moves 🕺🕺, @yuzi_chahal makes a smashing debut in the Caribbean. By @28anand #TeamIndia #WIvIND
Full video here 📽️📽️ https://t.co/Cql7RCoaw1 pic.twitter.com/CCQu6dDRJAMUST WATCH: Chahal TV returns with #KingKohli 😄😎
— BCCI (@BCCI) August 12, 2019
From @imVkohli's record 42 ton to his dance moves 🕺🕺, @yuzi_chahal makes a smashing debut in the Caribbean. By @28anand #TeamIndia #WIvIND
Full video here 📽️📽️ https://t.co/Cql7RCoaw1 pic.twitter.com/CCQu6dDRJA
ఇవీ చూడండి.. 'శతకం కోసం కోహ్లీ ఎంతో ఆరాటపడ్డాడు'