రోహిత్ శర్మలా ఆడటం కోహ్లీకి సాధ్యం కాకపోవచ్చు అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో ఆరు సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు సెహ్వాగ్.
"సచిన్ ఆడుతున్నప్పుడు 'నేను చేసేది నువ్వు చేయగలవు' అని నాతో చెప్పేవాడు. కానీ, తను సాధించేది ఎవరూ చేయలేరని అతడికి తెలియదు. రోహిత్ శర్మ కూడా అలాంటి ఆటగాడే. హిట్‌మ్యాన్ సాధించేది కోహ్లీ సాధించకపోవచ్చు. ఒకే ఓవర్‌లో కోహ్లీ 3-4 సిక్సర్లు, 45 బంతుల్లో 80-90 పరుగులు బాదడం మనం ఎక్కువసార్లు చూడలేదు."
-సెహ్వాగ్, టీమిండియా మాజీ ఆటగాడు
రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగాడు. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 85 పరుగులు సాధించాడు. ధావన్ (31), శ్రేయస్ అయ్యర్ (24*) ఆకట్టుకున్నారు. ఫలితంగా సిరీస్‌ను 1-1తో సమం చేసింది రోహిత్ సేన. చివరిదైన మూడో టీ20 నాగ్‌పుర్ వేదికగా ఆదివారం జరగనుంది.
ఇవీ చూడండి.. మహిళా హాకీ ఆణిముత్యం రాణి రాంపాల్