ETV Bharat / sports

'చిన్​ మ్యూజిక్'​ ప్లాన్​కు సమాధానముంది: గిల్ - ind vs aus news

తాను మరీ అంత నెమ్మదస్తుడిని కాదని యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ చెప్పాడు. అవసరమైనప్పుడు దూకుడుగా ఆడతానని అన్నాడు. ఆసీస్​తో తొలి టెస్టు నేపథ్యంలో పలు వ్యాఖ్యలు చేశాడు.

We've got plenty of moves in store to handle Aussie chin music: Shubman Gill
'చిన్​ మ్యూజిక్'​ ప్లాన్​కు సమాధానముంది: గిల్
author img

By

Published : Dec 14, 2020, 9:44 PM IST

ఆస్ట్రేలియా కవ్వింపులకు సిద్ధంగా ఉన్నామని, ప్రత్యర్థులు సంధించే బౌన్సర్లకు సమాధానాలు ఉన్నాయని టీమ్​ఇండియా యువఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన డే/నైట్ సన్నాహక మ్యాచ్‌లో 43, 65 పరుగులతో గిల్‌ ఆకట్టుకున్నాడు. దీంతో తుదిజట్టులో అతడి స్థానం ఖరారైనట్లే అని భావిస్తున్నారంతా. అయితే కంగారూల గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం అంత తేలికైనా విషయం కాదని గిల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అధికారిక వైబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతా తరఫున ఆడాడు.

"ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే భయపడే విషయమే. అయితే ఆ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నా. బ్యాట్స్‌మెన్‌కు తనపై తనకు విశ్వాసం మరింత పెరగాలంటే కంగారూల గడ్డపై రాణించడం కంటే మరో గొప్ప విషయం ఉండదు. అయితే ఒకప్పుడు భారత ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉండేవారు కాదని అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్ని మారిపోయాయి. కొందరు కవ్వింపులకు సమాధానం ఇవ్వరు. మరికొందరు దీటుగా బదులిస్తుంటారు. నా వరకు నేను అంత నెమ్మదస్తుడిని కాదు. అలా అని ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరించే వ్కక్తిత్వం కాదు" అని గిల్ అన్నాడు.

భారత బ్యాట్స్‌మెన్‌ను బౌన్సర్లతో బోల్తా కొట్టిస్తామని ఇటీవల ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ పేర్కొన్నాడు. దీనిపై గిల్‌ స్పందిస్తూ.. "చిన్‌ మ్యూజిక్‌ ప్రణాళికతో మమ్మల్ని ఔట్ చేయడానికి ఆసీస్ ఆటగాళ్లు ప్రయత్నించవచ్చు. అయితే వాటికి మా వద్ద సమాధానాలు ఉన్నాయి" అని అన్నాడు.

క్రికెట్ భాషలో బ్యాట్స్‌మెన్‌ దవడ, మెడను లక్ష్యంగా చేస్తూ బంతులు విసరడాన్ని చిన్‌ మ్యూజిక్ అంటారు. కాగా, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి టెస్టు డే/నైట్ పద్ధతిలో ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.