ఇప్పటికే టీ20, వన్డే సిరీస్లు కైవసం చేసుకున్న టీమిండియా టెస్టుల్లోను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మొదటి టెస్టులో 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన కోహ్లీసేన రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కింగ్ స్టన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన కరీబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
-
West Indies have won the toss and elect to bowl first in the 2nd Test against #TeamIndia#WIvIND pic.twitter.com/pI8f9GAIe5
— BCCI (@BCCI) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">West Indies have won the toss and elect to bowl first in the 2nd Test against #TeamIndia#WIvIND pic.twitter.com/pI8f9GAIe5
— BCCI (@BCCI) August 30, 2019West Indies have won the toss and elect to bowl first in the 2nd Test against #TeamIndia#WIvIND pic.twitter.com/pI8f9GAIe5
— BCCI (@BCCI) August 30, 2019
మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది టీమిండియా. వెస్టిండీస్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. షై హోప్ స్థానంలో హామిల్టన్ జట్టులోకి వచ్చాడు.
ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతోంది టీమిండియా. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడంలో సఫలమవుతోంది. బ్యాటింగ్లో కోహ్లీ, రహానే, విహారి సత్తాచాటారు. బౌలింగ్లో ఇషాంత్, బుమ్రా చెలరేగుతున్నారు. ఇదే పంతా కొనసాగిస్తే ఈ మ్యాచ్లోనూ విజయం ఖాయం.
విండీస్ విషయానికొస్తే వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. టాప్ క్లాస్ ఆటగాళ్లు ఆ జట్టు సొంతమైనా.. జట్టుగా ఆడటంలో విఫలమవుతున్నారు. షిమ్రాన్ హిట్మైర్, షాయ్ హోప్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. రెండో ఇన్నింగ్స్లో వంద పరుగులకే ఆలౌటై అప్రతిష్ఠ మూటగట్టుకుంది కరీబియన్ జట్టు. బౌలింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా.. సమష్టిగా రాణించలేకపోతున్నారు.
ఇవీ చూడండి.. 'అందుకే అతడ్ని ఎంపిక చేయలేదు'