ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను విండీస్ 2-2తో సమం చేసింది. ఆఖరి వన్డేలో గేల్, థామస్ మెరిశారు. ఏడు వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. సిరీస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఓ వన్డే వర్షం కారణంగా రద్దయింది.
ఒషానే థామస్ (21/5) విజృంభణతో బ్రిటీష్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. కరేబియన్ జట్టుపై ఇంగ్లాండ్‌కు ఇదే అత్యల్ప స్కోర్. ఇంగ్లాండ్ చివరి 5 వికెట్లను కేవలం రెండు పరుగులకే కోల్పోవడం విశేషం.
ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపిన గేల్ 27 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది వెస్టిండీస్.
4 మ్యాచుల్లో 106 సగటుతో 424 పరుగులు సాధించిన గేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' లభించింది.