ఢాకా వేదికగా బంగ్లాదేశ్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో, చివరి టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తలపించింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్ పనిపట్టిన కరీబియన్ జట్టు.. చివరకు 17పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి కరీబియన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బాహుబలి కార్న్‌వాల్(5/74, 4/105) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. కొత్త కుర్రాడు ఎన్. బానర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సొంతం చేసుకున్నాడు.
ఇదీ చదవండి: రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్