ETV Bharat / sports

'స్టార్​వార్స్​' మాస్క్​తో కరోనాపై డారెన్​ సామీ ఫైట్​ - darren sammy in Self-quarantine

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ వైరస్​ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలువురు క్రికెటర్లు ముందుకొస్తున్నారు. కొందరు చేతులు కడుక్కొని, మరికొందరు మాస్క్​లు ధరించి వీడియోలు పెడుతున్నారు. విండీస్ క్రికెటర్​ డారెన్​ సామీ మాస్క్​ పెట్టుకుని ఆసక్తికర లుక్​లో కనిపించాడు.

Darren Sammy
కరోనాపై 'స్టార్​వార్స్​' రూపంలో డారెన్​ సామీ ఫైట్​
author img

By

Published : Mar 21, 2020, 8:00 PM IST

ప్రాణాంతక కరోనా (కొవిడ్‌ 19) నుంచి తప్పించుకోవడం ఎలాగో క్రికెటర్ డారెన్‌ సామీని చూసి నేర్చుకోవాలేమో! వెస్టిండీస్‌ మాజీ సారథి అయిన ఇతడు ఈ మధ్యే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్​ ఆడాడు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పీసీబీ తమ టీ20 లీగ్‌ను సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్​లను రద్దు చేసింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. సామీ ఇంటికెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. వైరస్‌బారి నుంచి తప్పించుకునేందుకు, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఓ ప్రత్యేక మాస్క్‌ ధరించాడు.

West indies Cricketer Darren Sammy
విండీస్​ క్రికెటర్​ డారెన్‌ సామీ

ఆ ఫొటోను ట్విట్టర్​లో పోస్టు చేస్తూ స్వదేశానికి చేరుకున్నానని రాసుకొచ్చాడు. పాకిస్థాన్‌ నుంచి బయలుదేరే ముందు కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు నెగిటివ్‌ వచ్చిందని, అయినా ఇంటికెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులతో కలవకుండా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉంటానని చెప్పాడు. ఆ మాస్క్​తో తీసుకున్న చిన్నపాటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. స్టార్​వార్స్​ సినిమాలో నటులు ధరించిన మాస్క్​లా ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాలక్షేపం కోసం ఇంట్లో పేపర్​ రోల్​తో ఫుట్​బాల్​ ఆడిన వీడియోనూ షేర్​ చేశాడు.

ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడిన ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి మొత్తం కరోనా టెస్టులు నిర్వహించారు. ఎవరికీ పాజిటివ్‌ రిపోర్టు రాకపోవడం వల్ల పీసీబీ ఊపిరి పీల్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.