ETV Bharat / sports

'మ్యాచ్​ మొదలయ్యాకే వాషికి ప్యాడ్లు కొన్నాం'

author img

By

Published : Jan 23, 2021, 8:53 PM IST

Updated : Jan 24, 2021, 11:44 AM IST

ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక చివరి టెస్టులో బౌలింగ్​ సహా బ్యాటింగ్​తో అద్భుత ప్రదర్శన చేసి చారిత్రక విజయంలో ముఖ్య భూమిక పోషించాడు వాషింగ్టన్​ సుందర్. 4 వికెట్లు తీయడమే కాక 84 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్​ ప్రారంభానికి ముందు అతడి వద్ద బ్యాటింగ్ ప్యాడ్లు లేకపోవడం విశేషం.

'Went to a shop after the match had started' - Washington Sundar didn't have a pair of white pads before Gabba Test
'మ్యాచ్​ మొదలయ్యాకే అతడికి ప్యాడ్లు కొన్నాం'

గబ్బా టెస్టులో బ్యాట్​తో అద్భుత ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకున్నాడు వాషింగ్టన్​ సుందర్​. ఆ చారిత్రక గెలుపులో అతడు కీలకంగా మారతాడని ఎవరూ అనుకోలేదు. అయితే ఆ టెస్టు మ్యాచ్​కు ముందు అతడి వద్ద ప్యాడ్లు కూడా లేవని తెలిపారు ఫీల్డింగ్ కోచ్​ ఆర్​ శ్రీధర్.

టీ20 సిరీస్​ కోసమే సుందర్​ ఆస్ట్రేలియాకు వచ్చాడు. టెస్టు జట్టులో లేకపోయినా.. ఆసీస్​ స్టార్​ స్పిన్నర్ నాథన్​ లైయన్​ శైలిని అనుకరిస్తూ బౌలింగ్​ వేసి.. భారత బ్యాట్స్​మెన్​ సన్నమద్ధమవడానికి నెట్స్​లో సహకరించాడు.

ఆఖరి టెస్టుకు ముందు అశ్విన్​ గాయపడటం వల్ల సుందర్​కు జట్టులో తొలిసారిగా అవకాశం లభించింది. టీ20ల కోసమే వచ్చిన సుందర్​ వద్ద నీలి రంగు ప్యాడ్లు తప్ప తెల్లవి లేవు. నెట్స్​లోనూ బ్లూ ప్యాడ్లతోనే ప్రాక్టీస్​ చేశాడు.

అయితే సుందర్​కు సరిగ్గా సరిపోయే ప్యాడ్లను వెతకడానికి టీమ్​ఇండియా సహాయక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు శ్రీధర్. "ఎన్నో ప్యాడ్లను ప్రయత్నించినా.. అతడు చాలా పొడుగ్గా ఉండటం వల్ల సరిపోయేవి కావు. కొవిడ్​ కారణంగా ఆసీస్​ నుంచీ సహాయం లభించలేదు. ఎట్టకేలకు మ్యాచ్​ మొదలయ్యాక ఓ దుకాణంలో ప్యాడ్లు దొరికాయి," అని తెలిపారు.

ఇదీ చూడండి: యువ క్రికెటర్లకు బహుమతిగా మహీంద్ర ఖరీదైన కొత్త కార్లు

Last Updated : Jan 24, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.