ETV Bharat / sports

రెండో వన్డే​ ఓటమిపై కోహ్లీ స్పందన.. ఏమన్నాడంటే? - kohli blames bowling

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓటమికి కారణం తమ బౌలర్ల పేలవమైన ప్రదర్శనే కారణమని చెప్పాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాల్లో చాలా బలంగా ఉందన్నాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Nov 29, 2020, 8:41 PM IST

Updated : Nov 29, 2020, 9:38 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో తమ ఓటమిపై స్పందించాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. బౌలర్లు పేలవంగా ఆడటం వల్లే జట్టు పరాజయాన్ని చూసిందని అన్నాడు.

"మేం పేలవ ప్రదర్శన చేశాం. బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయాం. సరైన ప్రదేశాల్లో బంతులు సంధించడంలో విఫలమయ్యాం. అయితే ఆస్ట్రేలియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. కాగా, ఛేదనలో మేం 340 పరుగులు సాధించాం. విజయానికి 50 పరుగుల దూరంలో ఆగిపోయాం. కాబట్టి ఛేదన సాఫీగానే సాగిందని చెప్పొచ్చు. ఒకటి, రెండు వికెట్లు పడితే కావాల్సిన రన్‌రేటు 13 నుంచి 16కి చేరుతుంది. అందుకే దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాం".

-కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్ కోహ్లీ క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఫీల్డర్లు అద్భుతంగా అందుకున్నారు. దీని గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "ఆసీస్‌ జట్టు మైదానంలో అవకాశాలను సృష్టించుకొని సాధించింది. అదే మ్యాచ్‌లో తేడా. లేకపోతే మ్యాచ్‌ పోటాపోటీగా సాగేది. పరిస్థితులకు తగ్గట్లుగా ఆసీస్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. అయితే 40-41 ఓవర్ల వరకు నేను, కేఎల్ రాహుల్ క్రీజులో ఉండాలనుకున్నాం. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు సాధించాల్సిన తరుణంలో హార్దిక్‌ వచ్చి పని పూర్తిచేస్తాడని భావించాం. కానీ ఆ రెండు క్యాచ్‌లు మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాయి" అని కోహ్లీ అన్నాడు.

మరోవైపు తమ జట్టు అద్భుత ప్రదర్శన చేయడంపై ఆటగాళ్లను ప్రశంసించాడు ఆసీస్​ సారథి ఫించ్​. స్మిత్​ అసాధారణమైన ప్రదర్శన, వార్నర్​ జోరు విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు.

"బలమైన బ్యాటింగ్​ విభాగం వల్లే భారీ స్కోరు చేయగలిగాం. స్మిత్​, వార్నర్ అద్భుతంగా ఆడారు. హెన్రిక్స్ బౌలింగ్​ బాగా చేశాడు. కాగా, మా బౌలర్లు ప్రత్యర్థి జట్టు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా బౌలింగ్​ విధానం నుంచి కొన్ని మెలకువలను నేర్చుకున్నారు."

-ఫించ్​, ఆసీస్​ సారథి.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ కోహ్లీ సేన ఓడిపోయింది. తమ శక్తిమేర పోరాడినప్పటికీ భారీ లక్ష్యాన్ని భారత బ్యాట్స్​మెన్ ఛేదించలేకపోయారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్​ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది ఆసీస్​.

ఇదీ చూడండి :

రెండో వన్డే: కోహ్లీ మైలురాయి.. ఆసీస్ ఘనతలు

తొలి వన్డే: ఆసీస్​ ఘనతలు.. భారత్​ చెత్త రికార్డులివే..

Last Updated : Nov 29, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.