ETV Bharat / sports

ఇతరులకు ఆదర్శంగా నిలుద్దాం: సచిన్ - గ్లోబల్ హ్యాండ్ వాష్ డే

కరోనా విషయంలో జాగ్రత్తలు ఇంకా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపాడు టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. మనం జాగ్రత్తలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించాడు.

Sachin
సచిన్
author img

By

Published : Oct 15, 2020, 8:04 PM IST

కరోనా విషయంలో ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అన్నాడు. గ్లోబల్‌ హ్యాండ్‌వాష్‌ డే సందర్భంగా సచిన్‌ తన ట్విట్టర్​ ఖాతాలో ఓ పోస్టు చేశాడు.

"ప్రారంభంలో ఉన్న కరోనా నిబంధనల నుంచి మనం ఇప్పుడిప్పుడే విముక్తి పొందుతున్నాం. మళ్లీ సాధారణస్థితికి చేరుకుంటున్నాం. అయినప్పటికీ మనం ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. చేతులు కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, ఆరు అడుగుల దూరం పాటించడం వంటివి మనం మర్చిపోవద్దు. మనం పాటిస్తూ.. ఇతరులకూ ఆదర్శంగా నిలుద్దాం."

-సచిన్, టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్

కరోనా ప్రభావంతో 2020 ఏడాది అతలాకుతలమవుతోంది. వైరస్​కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో జాగ్రత్తలు పాటించడమే సరైన మార్గమని వైద్యులు కూడా చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.