ETV Bharat / sports

మ్యాచ్​ తర్వాత రోహిత్​, రహానె ఏమన్నారంటే..? - రహానే అప్డేట్స్​

చెన్నై వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్​లో సానుకూలంగా బ్యాటింగ్​ చేశామని భారత జట్టు ఉపసారథి అజింక్య రహానే అన్నాడు. ఈ మ్యాచ్​లో టాస్​ గెలవడం అత్యంత కీలకంగా మారిందని చెప్పాడు రహానె. స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్​పై.. 350 పరుగులు సాధించినా మంచి స్కోరేనని రోహిత్​ శర్మ అన్నాడు. ఈ క్రమంలో పంత్​, అక్షర్​లు రెండో రోజు ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు​.

We know it will turn on Day one says Ajinkya Rahane
'టర్న్‌' ముందే తెలుసు: అజింక్య
author img

By

Published : Feb 13, 2021, 11:00 PM IST

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలిరోజు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్‌ చేశామని టీమ్ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. భారత్‌ టాస్‌ గెలవడం కీలకంగా మారిందని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడాలని వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌తో పుజారా, తాను నెలకొల్పిన భాగస్వామ్యాలు మేలు చేస్తాయని తెలిపాడు. శనివారం ఆట ముగిశాక జింక్స్‌ మీడియాతో మాట్లాడాడు.

'తొలిరోజు నుంచే బంతి టర్న్‌ అవుతుందని మాకు తెలుసు. అందుకే టాస్‌ గెలవడం మేలు చేసింది. రోహిత్‌తో పుజారా, నేను చేసిన భాగస్వామ్యాలు కీలకంగా మారతాయి. ఈ వికెట్‌పై సానుకూలంగా బ్యాటింగ్‌ చేయాలని రోహిత్‌ నాతో చెప్పాడు. తొలి టెస్టుతో సంబంధం లేకుండా సానుకూలంగా ఉండాలని అనుకున్నా. మంచి ఫుట్‌వర్క్‌తో ఆడితే ఈ పిచ్‌పై పరుగులు వస్తాయి. స్వీప్‌ చేయడంపై మాకో వ్యూహం ఉంది. మాకు బలమైన ప్రాంతాల్లో బంతులు వేసేలా ప్రణాళికలు రచించాం. అవి ఫలించాయి' అని అజింక్య అన్నాడు.

'మ్యాచులో తొలి 20-30 బంతులు అత్యంత కీలకమని భావించాం. అందుకే సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మరో 50-60 పరుగులు చేస్తే బాగుంటుంది. రిషభ్‌ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఒకటి లేదా మరో రెండు భాగస్వామ్యాలు నెలకొల్పితే మేం మెరుగైన స్థితిలో ఉంటాం. ఇంగ్లాండ్‌ బౌలర్లు వేగంగా బంతులు వేసినప్పుడు ఆడటం కష్టంగా అనిపించింది. వేగంలో వైవిధ్యం కనిపించింది' అని వెల్లడించాడు రహానె.

రహానే నిరూపించుకున్నాడు: రోహిత్​

రెండో టెస్ట్ తొలిరోజు ఆట అనంతరం.. అజింక్య రహానే ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు సెంచరీ హీరో రోహిత్​ శర్మ. రహానె ఎల్లప్పుడూ క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకునే ఇన్నింగ్స్​ ఆడి బ్యాట్స్​మన్​గా తనను తాను నిరూపించుకుంటున్నాడన్నాడు. ఈ మ్యాచ్​లో అజింక్యతో కలిసి నాలుగో వికెట్​కు 162 పరుగులు జోడించాడు రోహిత్​.

'అజింక్య.. మా టాప్​ ఆటగాళ్లలో ఒకడు. అతను చాలా బాగా ఆడాడు. కొన్నేళ్లుగా సరైన టైమ్​లో కొన్ని కచ్చితమైన షాట్లు ఆడుతున్నాడు. జట్టును నిలబెట్టేందుకు ఓ బ్యాట్స్​మన్​ అవసరమైనప్పుడు.. ఆ భారాన్ని చాలా సార్లు భుజానికెత్తుకుని నెరవేర్చాడు. వరుసగా ఏడు ఇన్నింగ్స్​లో తక్కువ స్కోరుకే పరిమితమవుతున్నందున ఇటీవల.. అతడి ప్రదర్శనపై చర్చలు మొదలయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయంలోనే అతడికి మద్దతుగా నిలవాలి. జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు చేస్తే చాలు. మేమిద్దరం ఇవ్వాళ అదే చేశాం. ఈ వికెట్​పై 350 పరుగులు సాధిస్తే.. అదే మంచి స్కోరు. ఈ కీలక సమయంలో రిషభ్​, అక్షర్​లు వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్​ కొనసాగించాలని ఆశిస్తున్నాను.' అని రోహిత్​ పేర్కొన్నాడు.

చెపాక్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. పరిస్థితులు సవాళ్లు విసురుతున్నా, బంతులు ఘోరంగా టర్న్‌ అవుతున్నా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(161) శతకం బాదేశాడు. రహానె(67) అర్ధశతకంతో ఆదుకున్నాడు. రిషభ్ పంత్‌(33 బ్యాటింగ్‌), అక్షర్‌ పటేల్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి:

'రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుంది!'

సవాళ్లు విసిరే పిచ్‌పై దుమ్మురేపిన హిట్​మ్యాన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.