ETV Bharat / sports

'మహిళల ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది'

మహిళల ఐపీఎల్ ఈ ఏడాది కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. అంతకంటే ముందు వారికి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించాడు.

'మహిళల ఐపీఎల్ కచ్చితంగా ఉంటుంది'
'మహిళల ఐపీఎల్ కచ్చితంగా ఉంటుంది'
author img

By

Published : Aug 2, 2020, 1:58 PM IST

కరోనా కారణంగా వాయిదాపడ్డ ఐపీఎల్​ను సెప్టెంబర్​లో నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. దేశంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో దుబాయ్​లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే మహిళల ఐపీఎల్ లేదా ఛాలెంజర్స్ ట్రోఫీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఉమెల్ ఐపీఎల్ ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. కచ్చితంగా ఛాలెంజర్ ట్రోఫీని నిర్వహిస్తామని స్పష్టం చేశాడు.

"ఈ ఏడాది ఉమెన్ ఐపీఎల్ జరుగుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఐపీఎల్ చివర్లో ఈ టోర్నీని నిర్వహిస్తాం. పురుషులు, మహిళా క్రికెటర్లు ఎవరి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టదల్చుకోలేదు. కరోనా వల్ల నేషనల్ క్రికెట్ అకాడమీ మూతపడ్డా.. వేరే ప్రత్యామ్నాయాల్ని ఆలోచించి ఆటగాళ్ల ప్రాక్టీస్​కు ఏర్పాట్లు చేస్దాం."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

అయితే మహిళల ఛాలెంజర్ ట్రోఫీ నవంబర్ 1-10 వరకు జరగే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దానికంటే ముందు ఆటగాళ్లకు జాతీయ శిక్షణా శిబిరం నిర్వహిస్తామని వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.