ETV Bharat / sports

'వారితో పోల్చుకుంటే ఐదారేళ్లు వెనకే' - Harmanpreet Kaur about Australia England fitness

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో పోలిస్తే భారత మహిళా జట్టు ఐదేళ్లు వెనకబడి ఉండని తెలిపింది టీమ్​ఇండియా టీ20 సారథి హర్మన్ ప్రీత్ కౌర్. ప్రస్తుతం తామంతా ఫిట్​నెస్​పై శ్రద్ధ పెట్టామని స్పష్టం చేసింది.

హర్మన్
హర్మన్
author img

By

Published : Apr 2, 2020, 5:46 AM IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మహిళా జట్లతో పోలిస్తే భారత మహిళా జట్టు అయిదు నుంచి ఆరేళ్లు వెనకబడి ఉందని టీమ్‌ఇండియా టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ అభిప్రాయపడింది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడింది టీమ్​ఇండియా. ప్రస్తుతం వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌పైన దృష్టిపెట్టింది.

"గత రెండేళ్లలో మేం ఆటలో ఎంతో మెరుగయ్యాం. అయితే ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఎప్పటినుంచో పటిష్ఠంగా ఉన్నాయి. వారితో పోల్చుకుంటే క్రికెట్‌లో మేం 5-6 ఏళ్లు వెనకబడి ఉన్నాం. గతంలో దేశవాళీ ప్లేయర్లు, అంతర్జాతీయ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌లో ఎంతో తేడా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. ఇప్పుడు ఆటగాళ్లంతా ఆటతో పాటు ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. అయితే దేశవాళీ స్థాయిలోనే ప్లేయర్లను పటిష్ఠం చేయాలి. కానీ అది ఆశించిన రీతిలో జరగట్లేదు. అందుకే ఆసీస్‌, ఇంగ్లాండ్‌ కంటే అయిదారేళ్లు వెనకబడి ఉన్నాం."

-హర్మన్‌ప్రీత్‌, టీమ్​ఇండియా టీ20 సారథి

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సంప్రదాయాల్లో ఫిట్​నెస్ ఓ భాగమని.. కానీ దానిపై తాము ఆలస్యంగా దృష్టిసారించామని తెలిపింది హర్మన్.

"ఫిట్‌నెస్‌ ఆసీస్‌, ఇంగ్లాండ్‌ సంప్రదాయాల్లో భాగం. కానీ మేం దానిపై ఆలస్యంగా దృష్టి సారించాం. గత మూడేళ్లలో దానిలో మెరుగవ్వడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అయితే రాత్రికి రాత్రే ఇది వచ్చేది కాదు. నిరంతర కృషితో సాధ్యమవుతుంది. గతంలో ఆసీస్‌, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. కానీ ఇప్పుడు ఆ జట్లపై ఘన విజయాలు సాధిస్తున్నాం. నైపుణ్యపరంగా వారి కంటే ఎంతో మెరుగైన బ్యాటర్లు, బౌలర్లు మా జట్టులో ఉన్నారు. సారథి బాధ్యతలతో నేను ఎంతో నేర్చుకున్నా."

-హర్మన్‌ప్రీత్‌, టీమ్​ఇండియా టీ20 సారథి

టీ20 ప్రపంచకప్​ గ్రూపు స్టేజీలో అదరగొట్టింది భారత్. ఇంగ్లాండ్​తో సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం వల్ల ఫైనల్ చేరింది. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్​గా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.