కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్, దేశవాళీ మ్యాచ్‌లు ఆగిపోతే ఆటగాళ్లకు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని ఆసీస్ వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఆ సమస్యలను అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటామని తెలిపాడు.
"రెవెన్యూ షేర్ మోడల్లో ఈ విధమైన నష్టాలు వస్తాయి. ఆర్గనైజేషన్‌పై ప్రభావం పడితే అది ఆటగాళ్లపైనా ఉంటుంది. ఇటువంటి స్థితిని మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు. కొన్ని గంటల్లోనే మా ప్రయాణాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదని అనుకుంటున్నా. త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొంటుంది. కానీ, అది ఎంత కాలం పడుతుందో చెప్పలేము. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకుంటూ.. వ్యాప్తిని ఆపడానికి మీరు చేయగలిగినవి చేయండి."
- ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్
ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు ఆ దేశ బోర్డు గతంలోనే నిరభ్యంతర పత్రం ఇవ్వడం వల్ల ఇప్పుడు వాటిని పునఃసమీక్షిస్తామని చెప్పింది. ఇక ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వైరస్ కారణంగా అక్కడి ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ (ఒకవేళ ఏప్రిల్ 15న ప్రారంభమైతే)లో ఆడేది సందేహంగా మారింది. ప్రస్తుతం 17 మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ కాంట్రాక్టుల్లో ఉన్నారు. ఆసీస్ వన్డే జట్టు కెప్టెన్ ఫించ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఇదీ చూడండి.. శ్రేయస్, పాండ్య బ్రొమాన్స్.. రాహుల్ కామెంట్