ఈసారి ఐపీఎల్ మరింత ప్రత్యేకమని మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కొన్ని నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతుండటమే ఇందుకు కారణమని అన్నాడు. భారత్‌లో క్రికెట్ అంతర్భాగమని చెప్పిన సెహ్వాగ్.. లీగ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు.
ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు ధోనీ. యూఏఈ వేదికగా జరగబోయే ఈ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా మహీ ఉన్నాడు. సెప్టెంబరు 19న అబుదాబీ వేదికగా తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది చెన్నై సూపర్‌కింగ్స్.