టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. మైదానంలో బ్యాట్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టేస్తాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మరోసారి కోహ్లీ ఫీల్డింగ్ హైలెట్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో చేసిన ఓ మెరుపు రనౌట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. 166 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగానే ఆరంభించింది న్యూజిలాండ్ జట్టు. గప్తిల్(4) ఆదిలోనే ఔటైనా.. మరో ఓపెనర్ మున్రో(64), సీఫెర్ట్(57) రాణించారు. అయితే ఒకానొక సమయంలో 11.4 ఓవర్లకు 96 పరుగులతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌కు తనదైన ఫీల్డింగ్‌తో షాకిచ్చాడు కోహ్లీ.
శివమ్ దూబే వేసిన బంతిని కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు మున్రో. అయితే బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లీకి అందించాడు. బంతిని అందుకున్న విరాట్ అంతే వేగంతో స్ట్రైకింగ్ ఎండ్‌లోకి విసిరి వికెట్లను పడగొట్టాడు. అప్పటికి ఒక పరుగు తీసి మరో పరుగు కోసం ప్రయత్నిస్తున్న మున్రో రనౌట్ అయ్యాడు. ఫలితంగా మున్రో 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు సాధించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
-
You Can't Ignore him...!
— Harshit Pachouri (@Instastariam) January 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli👌🤙#NZvsIND #ViratKohli pic.twitter.com/lmL1Euiw7w
">You Can't Ignore him...!
— Harshit Pachouri (@Instastariam) January 31, 2020
Virat Kohli👌🤙#NZvsIND #ViratKohli pic.twitter.com/lmL1Euiw7wYou Can't Ignore him...!
— Harshit Pachouri (@Instastariam) January 31, 2020
Virat Kohli👌🤙#NZvsIND #ViratKohli pic.twitter.com/lmL1Euiw7w
ఓపెనర్ మున్రో పెవిలియన్ చేరాక టిమ్ సీఫెర్ట్, టేలర్ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. సీఫెర్ట్ అర్ధశతకంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ గెలుపునకు చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా శార్దూల్ అద్భుత బౌలింగ్‌కు 6 రన్స్ చేసి మ్యాచ్‌ను టై చేసుకుంది న్యూజిలాండ్.