టీమ్ఇండియా నయా ఓపెనర్లు రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి ఇంగ్లాండ్‌తో చివరి టీ20లో అదరగొట్టారు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఒకవేళ జట్టుకు అవసరమైతే భవిష్యత్తులోనూ విరాట్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెడతానని హిట్‌మ్యాన్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
"ఈ బ్యాటింగ్ ఆర్డర్‌తో మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు కెప్టెన్ ఏం ఆలోచిస్తాడో దానినే మేం ఆచరణలో పెడతాం. ఒకవేళ కోహ్లీ నాతో ఓపెనింగ్ చేయడం జట్టుకు మంచిదనిపిస్తే.. అలానే కొనసాగిస్తాం. అయితే వన్డే సిరీస్‌లో విరాట్ ఓపెనర్‌గా వస్తాడని అనుకోవట్లేదు" అని రోహిత్ చెప్పాడు.
"టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయముంది. అందులో ఆడే జట్టు గురించి ఇప్పడే మాట్లాడటం సరికాదు. ఈ మ్యాచ్‌లో ఎక్స్ట్రా బౌలర్ కోసం బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను తప్పించాం. అయితే అతడు జట్టులో కీలక సభ్యుడు. వరల్డ్‌కప్‌లో ఎవరెవరు ఉండాలనే విషయం మేనేజ్మెంట్ చూసుకుంటుంది" అని రోహిత్ తెలిపాడు.
శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ 36 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. ఈనెల 23న పుణెలో ఇరుజట్లు తొలి వన్డే ఆడనున్నాయి.
-
💬 "Bhuvi has performed really well, he remains our leading bowler."
— BCCI (@BCCI) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
@ImRo45 lauds @BhuviOfficial on his performance in the comeback series against England. 👏👏#TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/tuDykOSZPG
">💬 "Bhuvi has performed really well, he remains our leading bowler."
— BCCI (@BCCI) March 20, 2021
@ImRo45 lauds @BhuviOfficial on his performance in the comeback series against England. 👏👏#TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/tuDykOSZPG💬 "Bhuvi has performed really well, he remains our leading bowler."
— BCCI (@BCCI) March 20, 2021
@ImRo45 lauds @BhuviOfficial on his performance in the comeback series against England. 👏👏#TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/tuDykOSZPG
ఇవీ చదవండి: