మెల్బోర్న్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ క్రికెటర్ హెన్రీ నికోలస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ఆటకే హైలెట్‌గా నిలిచింది. గాల్లోకి ఎగిరి ఒక్క చేత్తోనే బంతిని అందుకున్నాడు నికోలస్.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 105వ ఓవర్ నాలుగో బంతి. నీల్ వాగ్నర్ బౌలింగ్. షార్ట్ పించ్ బంతిని ఎలా ఆడాలో తికమకపడ్డ స్మిత్ బ్యాట్‌ను అడ్డుపెట్టాడు. అదికాస్తా ఎడ్జ్ తీసుకుంది. బంతి గాల్లోకి లేచింది. గల్లీలో ఉన్న నికోలస్.. వెనక్కి వెళుతున్న బంతిని.. అమాంతరం ఎగిరి ఒంటిచేత్తో పట్టేశాడు. ఫలితంగా స్మిత్.. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
-
✈ We have takeoff! ✈
— cricket.com.au (@cricketcomau) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A flying Henry Nicholls takes a screamer in the gully to remove Steve Smith! @bet365_aus | #AUSvNZ pic.twitter.com/SlCDEWXNSY
">✈ We have takeoff! ✈
— cricket.com.au (@cricketcomau) December 27, 2019
A flying Henry Nicholls takes a screamer in the gully to remove Steve Smith! @bet365_aus | #AUSvNZ pic.twitter.com/SlCDEWXNSY✈ We have takeoff! ✈
— cricket.com.au (@cricketcomau) December 27, 2019
A flying Henry Nicholls takes a screamer in the gully to remove Steve Smith! @bet365_aus | #AUSvNZ pic.twitter.com/SlCDEWXNSY
శుక్రవారం.. ఓవర్‌నైట్ స్కోరు 257/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 467 పరుగుల వద్ద ఆలౌటైంది. హెడ్ (114) సెంచరీతో మెరవగా.. స్మిత్ (85), పైన్ (79), లబుషేన్ (63) అర్ధశతకాలతో రాణించారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.
ఇవీ చూడండి.. మాలిక్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ట్రోల్స్ వర్షం