ETV Bharat / sports

కోహ్లీ కోసం బయోబబుల్​ నిబంధనలు బ్రేక్ - విరాట్ అభిమాని

మొతేరా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్​లో కోహ్లీ బ్యాంటింగ్​ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఇది చూసిన కోహ్లీ ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. అతడిని దూరం నుంచే పంపించేశాడు.

Watch: Fan breaches bio-bubble to meet Virat Kohli
కోహ్లీని కలిసేందుకు అభిమాని ఆంక్షల ఉల్లంఘన
author img

By

Published : Feb 25, 2021, 9:38 AM IST

ఇంగ్లాండ్​తో మొతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్​లో.. ఓ అభిమాని బయో బబుల్​ నిబంధనలు ఉల్లంఘించాడు. భారత సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో.. అతడిని కలిసేందుకు మైదానంలోకి పరుగులు పెట్టాడు. ఇది గమనించిన కోహ్లీ.. ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. వెంటనే పక్కకు జరిగి.. అభిమానిని దూరం నుంచే పంపించేశాడు.

భద్రతా నిబంధనలను అతిక్రమించి అభిమాని మైదానంలోకి దూసుకొచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయోబబుల్​​ ప్రోటోకాల్స్​లో భాగంగా క్రికెటర్లు, అధికారులు ఎవరినీ కలవడానికి లేదు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో కేవలం 50శాతం మంది మాత్రమే ప్రేక్షకులను అనుమతించారు.

ఇదీ చూడండి: పింక్​ టెస్ట్​: రోహిత్​ అర్ధసెంచరీ.. టీమ్​ఇండియా 99/3

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.