ETV Bharat / sports

'ఈ సమయంలో భారత్-పాక్ సిరీస్​ చాలా ముఖ్యం' - భారత్-పాకిస్థాన్ సిరీస్​పై అఫ్రిదీ

భారత్-పాకిస్థాన్ మధ్య త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్ జరగబోతుందని సమాచారం. తాజాగా ఈ విషయమై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. క్రీడల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని తెలిపాడు.

Afridi
అఫ్రిదీ
author img

By

Published : Mar 25, 2021, 5:45 PM IST

భారత్​-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరగక దాదాపు 8 ఏళ్లు కావొస్తుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా.. ఆ ప్రభావం క్రికెట్​పైనా పడింది. కానీ, ఈ రాజకీయాలు అన్నీ పక్కనపెట్టి ఇరుదేశాలు త్వరలోనే ఓ సిరీస్​లో పాల్గొబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదే రెండు దేశాల మధ్య 3 మ్యాచ్​ల టీ20 సిరీస్ జరగనుందని సమాచారం. తాజాగా దీనిపై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. క్రికెట్ వల్ల ఇరుదేశాల మధ్య స్నేహబంధం పెరుగుతుందని పేర్కొన్నాడు.

  • Shahid Afridi 'Cricket's played a big role in relations between India & Pakistan & should be kept away from politics.Indian & Pakistani players always enjoyed themsleves in each other's countries. Relations can improve if they want to - if there's a will, there's a way" #Cricket pic.twitter.com/iEa9AdYASB

    — TEAM AFRIDI (@TEAM_AFRIDI) March 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సిరీస్​లు చాలా ముఖ్యం. క్రీడల్ని రాజకీయలకు దూరంగా ఉంచాలి. క్రికెట్ వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. పాక్​కు రావడాన్ని భారత క్రికెటర్లు ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం."

-అఫ్రిదీ, పాక్ మాజీ క్రికెటర్

పాకిస్థాన్ వార్తా పత్రిక 'జాంగ్​' ప్రకారం.. దాయాది దేశంతో టీమ్​ఇండియా త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్​ ఆడనుందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమైన వెంటనే సిరీస్​ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పాక్ క్రికెట్​ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.