టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇటీవలే 12 వేల పరుగుల మైలురాయిని అందుకుని సచిన్ తెందూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. కోహ్లీ కొత్త రికార్డును ఉద్దేశిస్తూ షేర్ చేసిన ఈ మీమ్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది .
-
🐐 🐐 :) pic.twitter.com/kgbULTTsC7
— Wasim Jaffer (@WasimJaffer14) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🐐 🐐 :) pic.twitter.com/kgbULTTsC7
— Wasim Jaffer (@WasimJaffer14) December 3, 2020🐐 🐐 :) pic.twitter.com/kgbULTTsC7
— Wasim Jaffer (@WasimJaffer14) December 3, 2020
విరాట్, సచిన్ కలిసి నిలుచున్న ఓ ఫోటోను 'ది ఆఫీస్' షో మీమ్‌తో కలిపి పోస్ట్ చేశాడు జాఫర్. ఈ మీమ్‌లో రెండు గొర్రెలు ధైర్యంగా నిలుచుని ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోపై 'ఈ రెండు ఫొటోలకు మధ్య తేడా ఏంటో కార్పొరేట్‌కు తెలియాలి' అనే కామెంట్ రాసి ఉంది. దీనికి స్పందించినట్లుగా 'రెండూ ఒకే ఫొటో' అని ఓ మహిళ సమాధానం చెబుతున్నట్లు ఉన్న మీమ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
కొంతకాలంగా కోహ్లీని సచిన్‌నూ పోలుస్తూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కొందరు సచిన్ గ్రేట్ అంటే మరికొందరు కోహ్లీనే ఉత్తమమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జాఫర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:కొడుకుతో సరదాగా సానియా మీర్జా