ETV Bharat / sports

థ్యాంక్యూ సర్‌..ఇలానే ఆడతాం: సుందర్‌ - anand mahindra

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు యువ క్రికెట్ వాషింగ్టన్ సుందర్. ఆయన ఇచ్చిన కానుక పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

washington sundar thanks anand mahindra for thar suv humbled by your gift
థ్యాంక్యూ సర్‌..ఇలానే ఆడతాం: సుందర్‌
author img

By

Published : Jan 29, 2021, 9:16 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు టీమ్​ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రోత్సహిస్తూ, మద్దతుగా నిలవడం సహ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ట్విటర్‌లో ధన్యవాదాలు చెప్పాడు.

ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా టెస్టు సిరీస్‌ విజయం సాధించిన అనంతరం ఆరుగురు భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా 'థార్‌ ఎస్‌యూవీ' కార్లను బహుమతిగా ఇచ్చారు. సుందర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైని, టి.నటరాజన్‌లకు కార్లను ఇచ్చారు.

  • Humbled by your kind gift Sir @anandmahindra. Thank you for all the support & encouragement that you give us youngsters. We will continue to do our best. 😊

    — Washington Sundar (@Sundarwashi5) January 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సందర్భంగా మహీంద్రాకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు సుందర్. "ఆనంద్ మహీంద్రా సర్‌.. మీరు గిఫ్ట్‌ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా యువకులకు ఇస్తోన్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు. మా అత్యుత్తమ ప్రదర్శనను ఇలానే కొనసాగిస్తాం" అని అన్నాడు.

ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా భారత యువ ఆటగాళ్లు అద్భుత పోరాటంతో ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సుందర్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. అర్ధశతకం సాధించడం సహ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186/6తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శార్దూల్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇదీ చూడండి: యువ క్రికెటర్లకు బహుమతిగా మహీంద్ర ఖరీదైన కొత్త కార్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.