ETV Bharat / sports

'ప్రపంచకప్​లో నా చేయి విరగాలని కోరుకున్నా'

author img

By

Published : Mar 26, 2020, 1:50 PM IST

తీవ్ర ఒత్తిడికిలోనైన క్రికెటర్ మ్యాక్స్​వెల్.. తన చేయి తానే విరగాలని కోరుకున్నాడు. అదీ ప్రపంచకప్​లో. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఇలా చేసుకోవాలని అనుకున్నాడు?

CRICKETER MAXWELL
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్

2019లో జరిగిన వన్డే ప్రపంచకప్​లో ఒకానొక సందర్భంలో తన చేయి విరగాలని కోరుకున్నానన్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్. అలా అయితే ఆటకు కొన్ని రోజులు విరామం తీసుకోవచ్చనే అభిప్రాయంతో ఇలా అనుకున్నానని చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ప్రాక్టీస్​ చేస్తుండగా షాన్​మార్ష్​, తన మోచేతిని ఢీకొట్టినప్పుడు ఇలా జరగాలని కోరుకున్నట్లు మ్యాక్స్​వెల్ చెప్పాడు.

ప్రపంచకప్​ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్​ ఆడిన ఆసీస్​ జట్టులో ఉన్నాడు మ్యాక్స్​వెల్. ఇందులో బ్యాటింగ్​లో ఆకట్టుకున్నాడు. 2-0 తేడాతో ఈ సిరీస్​ను కైవసం చేసుకున్నారు కంగారూలు.

ఈ సిరీస్​ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నట్లు సహచరులతో చెప్పాడు మ్యాక్స్​వెల్. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందించారని అన్నాడు. బ్రేక్ తీసుకున్న కొన్నాళ్ల తర్వాత బిగ్​బాష్ లీగ్​లో పాల్గొన్న ఇతడు.. మెల్​బోర్న్ స్టార్స్​ జట్టు​ రన్నర్​గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి: కరోనాతో సంబంధం లేకుండా ఐపీఎల్​ ప్రాక్టీస్​లో​ స్టోక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.