ఐపీఎల్ 12వ సీజన్‌లో సత్తాచాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచకప్ దృష్ట్యా స్వదేశమైన ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించి.. ప్లే ఆఫ్స్ రేసుకు మరింత దగ్గర చేశాడీ ఆసిస్ బ్యాట్స్‌మెన్. వెళుతూ... వెళుతూ సన్‌రైజర్స్ అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు.
"మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు.. గతేడాదీ మీరు నాకు మద్దతుగా నిలిచారు. సన్‌రైజర్స్ కోసం ఆడటానికి చాలా ఎదురు చూశా. ఫ్రాంఛైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్ మీడియా విభాగం, అభిమానులు నా పునరాగమనానికి ఘనస్వాగతం పలికారు. మీతో ఆడడాన్ని ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో జట్టు విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా"
- డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ ఆటగాడు
పంజాబ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్ (56 బంతుల్లో 81 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తాచాటాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 692 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చూడండి.. 'అమ్మా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది'