ETV Bharat / sports

వన్డే ప్రపంచకప్​ ఆడటమే నా లక్ష్యం: ఇషాంత్

ప్రపంచకప్​ కంటే ముందు వన్డే జట్టు​లో మళ్లీ స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాని తెలిపాడు సీనియర్ పేసర్​ ఇషాంత్​ శర్మ. జట్టులో ఆడుతున్నప్పుడు ధోనీ.. తనకు చాలా మద్దతుగా నిలిచాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

author img

By

Published : Aug 5, 2020, 2:06 PM IST

Wants to be part of World Cup-winning team, says Ishant Sharma
వన్డే ప్రపంచకప్​లో ఆడటమే నా లక్ష్యం: ఇషాంత్

భారత వన్డే జట్టులో స్థానం కోసం తిరిగి ప్రయత్నిస్తున్నానని అంటున్నాడు టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ. దీనితోపాటే వన్డే ప్రపంచకప్​లోనూ భాగం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

"అందరిలాగే నేనూ ప్రపంచకప్​లో ఆడేందుకు ఇష్టపడతాను. విజేతగా నిలిచిన జట్టులోనూ భాగం కావాలని కోరుకుంటున్నా. మిగిలిన ట్రోఫీలతో పోలిస్తే ఇది పూర్తిగా ప్రత్యేక అనుభూతి. ప్రస్తుతం మేం ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఆడుతున్నాం. ఇదీ ప్రపంచకప్​ అయినా.. చాలా మంది దీన్ని వన్డే ప్రపంచకప్​లా భావించరు"

-ఇషాంత్​ శర్మ, టీమ్​ఇండియా పేసర్

ఇషాంత్​.. అంతర్జాతీయ కెరీర్​లో భారత్​ తరఫున 80 వన్డేల్లో 115 వికెట్లు, 97 టెస్టుల్లో 297 వికెట్లు తీశాడు. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

మాజీ కెప్టెన్​ ధోనీ తనకు ఎప్పుడూ మద్దతుగా నిలిచేవాడని చెప్పాడు ఇషాంత్. "97 టెస్టులాడిన తర్వాత కూడా నా సగటు, స్ట్రై​క్​రేటు నాకే అర్థం కాలేదు. అలాంటి విషయాలు నన్ను ఎప్పుడూ బాధించలేదు. అవి కేవలం సంఖ్యలు మాత్రమే. కానీ, కెప్టెన్​తో బౌలర్​కు ఉండే కమ్యూనికేషన్​ చాలా ముఖ్యం. నేను ధోనీతో అలానే ఉంటున్నా. అందుకే అతడి నుంచి నాకు మద్దతు లభించింది" అని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.