ETV Bharat / sports

బ్రిస్బేన్​ టెస్టు: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఎవరి సొంతం? - భారత్​ ఆసీస్​ నాలుగో టెస్టు ప్రివ్యూ

నిర్ణయాత్మక నాలుగు టెస్టులో గెలవాలని టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా పట్టుదలగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి? భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటలకు నాలుగో టెస్టు మొదలు కానుంది.

brisbane
బ్రిస్బేన్​
author img

By

Published : Jan 14, 2021, 5:31 PM IST

Updated : Jan 14, 2021, 7:12 PM IST

హోరాహోరీగా సాగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో రసవత్తర సమరానికి వేళైంది. శుక్రవారం నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠత ఏర్పడింది. గత మ్యాచు ఫలితంగా ఆత్మవిశ్వాసం, గాయాలతో బాధతో భారత్‌ బరిలోకి దిగుతుంటే.. గొప్ప రికార్డున్న గబ్బాలో మరోసారి తమదే పైచేయి అవుతుందన్న ధీమాతో ఆతిథ్య జట్టు పోరుకు సిద్ధమైంది. మరి సిరీస్‌ ఎవరి సొంతమవుతుందో?

భారత ఆటగాళ్లు ఎలా రాణిస్తారో!

నాలుగు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో చివరి మ్యాచుకు భారత జట్టు సిద్ధమైంది. అడిలైడ్‌ టెస్టులో ఓటమి పాలైనప్పటికీ.. మెల్‌బోర్న్‌ మ్యాచులో గెలిచి.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు డ్రాగా ముగించిన టీమ్​ఇండియా.. నాలుగో పోరులో గెలవాలనే పట్టుదలతో ఉంది. సారథి కోహ్లీ పితృత్వ సెలవుపై వెళ్లిన తర్వాత అజింక్య రహానె సారథ్యంలో ఓ టెస్టు గెలిచి, మరో మ్యాచును డ్రా చేసుకున్న ఉత్సాహంతో శుక్రవారం నిర్ణయాత్మక మ్యాచుకు సన్నద్ధమవుతోంది. సిడ్నీలో ఓడుతుందనుకున్న మ్యాచును పూజారా, పంత్‌, విహారి, అశ్విన్‌ వీరోచిత బ్యాటింగ్‌తో డ్రా చేశారు. బౌలర్లకు అనుకూలించే బ్రిస్బేన్‌లో భారత్ ఎలా ఆడతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా కేఎల్​ రాహుల్‌, విహారి లాంటి బ్యాట్స్‌మెన్, పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఆల్‌రౌండర్‌ జడేజాలు గాయాలతో ఇప్పటికే జట్టుకు దూరమైన వేళ.. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే అంశంపై ఆసక్తి కలిగిస్తోంది.

తమవద్దే ఉంచుకోవాలని

బ్రిస్బేన్‌ టెస్టులో కనీసం డ్రా చేసుకుని.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని మరో రెండేళ్లు తమవద్దే ఉంచుకోవాలనే పట్టుదలతో టీమ్​ఇండియా వ్యూహాలు రచిస్తోంది. గాయాంతో దూరమైన మయాంక్‌.. ఫిట్‌నెస్‌ ఒకవేళ సాధిస్తే రోహిత్‌శర్మ, శుభమన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారు. మయాంక్‌ వన్‌డౌన్‌లో వస్తాడని తెలుస్తోంది. తర్వాత పూజారా, రహానె, పంత్‌ వస్తారని భావిస్తున్నారు. బుమ్రా ఆడతాడా లేదా అన్నది శుక్రవారమే తెలుస్తుంది. ఒకవేళ అతడు ఫిట్​నెస్​ సాధించకపోతే మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌, నటరాజన్‌ బరిలోకి దిగుతారు. స్పిన్‌ విభాగంలో‌ అశ్విన్‌ కొనసాగనుండగా జడేజా స్థానంలో‌ సాహా, పృథ్వీ షా, వాషింగ్టన్‌ సుందర్‌లలో ఒకరు బరిలోకి దిగే అవకాశముంది.

రికార్డును కొనసాగించి సిరీస్​ను సొంతం చేసుకుంటుందా?

ఆస్ట్రేలియా ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. ఈ పోరుకు యువ ఆటగాడు పకోస్కీ దూరమయ్యాడు. 1988 తర్వాత బ్రిస్బేన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని రికార్డు సహా బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వ్యూహాలు రచించి బరిలో దిగుతుంది ఆసీస్​. వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్ లాంటి బ్యాట్స్‌మెన్‌తో ఆసీస్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో కమిన్స్‌, స్టార్క్‌,‌ హేజిల్‌వుడ్‌, నాథన్‌ లైయన్‌లతో‌ బలంగా ఉంది.

ఇదీ చూడండి: బ్రిస్బేన్​ టెస్టు: తలబడి నిలిచేనా.. ప్రత్యర్థిపై గెలిచేనా?

Last Updated : Jan 14, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.