కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన పాకిస్థాన్ సూపర్‌లీగ్‌ను తిరిగి నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. టోర్నీలో పాల్గొన్న ఆరుగురికి కరోనా సోకిన తర్వాత.. గతవారమే లీగ్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది.
అయితే టోర్నీ తిరిగి ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై పీసీబీ నేతృత్వంలో ఆరు ఫ్రాంచైజీలు గురువారం సమావేశమయ్యాయి. ఈ ఏడాది జూన్ 26న పాక్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన వెళ్లనున్న సందర్భంగా అంతకంటే ముందే టోర్నీలో ఆగిపోయిన మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ భావించినట్లు తెలుస్తోంది. అయితే లీగ్‌లో మిగిలిన 20 మ్యాచ్‌లను కరాచీ వేదికగా నిర్వహించనున్నట్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: పీఎస్ఎల్లో మరో ముగ్గురికి కరోనా.. టోర్నీ వాయిదా