ETV Bharat / sports

కోహ్లీ 'డకౌట్'​.. అభిమానుల్లో కలవరం

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో విరాట్​ కోహ్లీ డకౌట్​గా వెనుదిరగడం అభిమానులను కలవరపెడుతోంది. కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చాలా నెలలు గడిచిపోయింది. దీనికి తోడు గత ఐదు ఇన్నింగ్స్​లలో కోహ్లీ మూడు సార్లు డకౌట్​గా వెనుదిరగడం చర్చలకు దారితీస్తోంది. అయితే.. కోహ్లీని వీలైనంత త్వరగా ఔట్​ చేయడం తమ జట్టుకు బలాన్నిస్తుందని ఇంగ్లాండ్​ పేసర్ ఆర్చర్​ అన్నాడు.

Virat Kohli's successive ducks a concern for India
ఆ విషయంలో కోహ్లీపై అభిమానుల నిరాశ
author img

By

Published : Mar 13, 2021, 7:10 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇటీవలి ప్రదర్శన అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకప్పుడు పరుగుల వరద పారించిన విరాట్​.. సెంచరీ కొట్టి చాలా నెలలు గడిచిపోయింది. దీనికి తోడు.. ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో డకౌట్​గా వెనుదిరిగాడు కోహ్లీ. ఆడిన చివరి 5 ఇన్నింగ్స్​ల్లో మూడు సార్లు డకౌట్​ అయ్యాడు. ఇది మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం.

తడబడుతూ..

గత కొన్ని ఇన్నింగ్స్​ల్లో భారీ స్కోరు చేయడంలో కోహ్లీ విఫలమవుతున్నాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. చివరి టెస్టులో భారత్​ ఘన విజయం సాధించి సిరీస్​ నెగ్గినా.. కోహ్లీ విషయంలో నిరాశే మిగిలింది. ఆ టెస్టులో భారత్ ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్​లోనూ డకౌట్​ అయ్యాడు విరాట్​. ఇంగ్లాండ్​తో తొలి టీ20లోనూ మొదటి నాలుగు బంతులు అతికష్టంగా ఎదుర్కొన్న అతను ఐదో బంతికి డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో విరాట్​ వరుస డకౌట్​లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత అభిమానులను ఈ విషయం కలవరపెడుతుంటే.. ప్రత్యర్థి జట్లు మాత్రం ఊపిరిపీల్చుకుంటున్నాయి. వీలైనంత త్వరగా కోహ్లీని ఔట్​ చేయడం మా జట్టుకు బోనస్​ లాంటిది అని ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ అన్నాడు.

"కోహ్లీ చాలా గొప్ప బ్యాట్స్​మన్​. అతడిని వీలైనంత త్వరగా పెవిలియన్​​కు పంపడం మా జట్టుకు బోనస్​ లాంటింది. ఇది భారత జట్టుపై ప్రభావం చూపిస్తుంది."

--జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ పేసర్.

తన పేలవ బ్యాటింగ్​ ప్రదర్శనపై స్పందించిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ జర్నీలో ఒడుదొడుకులు సహజమేనని అన్నాడు. ఓ బ్యాట్స్​మన్​గా దీన్ని అంగీకరించక తప్పదని పేర్కొన్నాడు. తనకున్న ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటానని తెలిపాడు.

ఇదీ చదవండి:రెండో టీ20కి కొత్త వ్యూహంతో కోహ్లీ సేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.