భారత క్రికెట్లో మార్పులను తాము నిరంతరం పరిశీలిస్తుంటామని చెప్పాడు బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్. సారథి విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సాధన చూసి తాను సిగ్గుపడినట్లు పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో బంగ్లాదేశ్ దృక్పథం మారేందుకు కోహ్లీసేన ఎంతో ప్రభావం చూపుతోందని వెల్లడించాడు.
"భారత్ మా పొరుగు దేశం. అక్కడే ఏం జరుగుతుంతో గమనించి మేం అనుసరిస్తాం. ఫిట్‌నెస్‌పై టీమ్‌ఇండియా క్రికెటర్ల దృక్పథం బంగ్లాదేశ్‌పై ఎంతో ప్రభావం చూపిస్తోంది" అని తమీమ్ అన్నాడు. తన వయసులోనే ఉన్న కోహ్లీకి ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధ చూసి ఆశ్చర్యపోయానని అతడు వెల్లడించాడు.
"ఇది చెప్పేందుకు నేను సిగ్గుపడను. ఈ సంగతి చెప్పాల్సిందే. 2-3 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ జిమ్‌లో చేసే కసరత్తులు, మైదానంలో పరుగెత్తడం చూసి నాపై నాకే సిగ్గేసింది. అత్యంత విజయవంతం అయినప్పటికీ నా వయసులో ఉన్న అతడు ఎంతో సాధన చేస్తున్నాడు. నేనందులో సగం కూడా శ్రమించడం లేదు. నేను అంత స్థాయిలో కష్టపడకపోయినా కనీసం అతడి దారిలోనైనా నడుస్తాను. బహుశా 50-60 శాతమైనా చేరుకోవచ్చు" అని తమీమ్ అన్నాడు.
ఇదీ చూడండి... ఫ్లాయిడ్ ఉదంతంపై గళం విప్పిన క్రీడాలోకం