ETV Bharat / sports

కోహ్లీ టాస్ వ్యథ.. ఎప్పటికి మారేనో?

ఇంగ్లాండ్​తో ఇటీవల జరిగిన సిరీస్​ల్లో కోహ్లీని టాస్ తెగ ఇబ్బంది పెట్టింది. ఇప్పుడే కాదు గతంలోనూ అతడు టాస్ విషయంలో ప్రతికూల ఫలితాలనే పొందాడు. ఇంతకీ కోహ్లీని వెంటాడుతున్న ఆ వ్యథ ఏంటి?

author img

By

Published : Mar 29, 2021, 6:49 AM IST

virat kohli toss story
కోహ్లీ టాస్ వ్యథ.. ఎన్నటికీ మారేనో?

అత్యవసరంగా టాస్‌ వేసే నాణాన్ని మార్చండి.. రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌కు స్పిన్నర్‌ అశ్విన్‌ అభ్యర్థన..!

టాస్‌ కోసం వేరే వ్యక్తిని తీసుకు రావాల్సిన సమయం ఇది..!

అతడు టాస్‌ గెలిస్తేనే నీ ప్రేమను అంగీకరిస్తా.. ఇది తన ప్రియురాలి గురించి చెబుతూ ఓ ప్రియుడి ఆవేదన!

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి టాస్‌ సందర్భంగా దురదృష్టం వెంటాడుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న జోకులివి!

virat kohli toss story
ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్​ టాస్ దృశ్యం

12 టాస్‌లు.. 10 సార్లు ప్రతికూల ఫలితమే. ఈ ఒక్క గణాంకం చాలు కోహ్లీని టాస్‌ ఏ రకంగా తిప్పలు పెడుతుందో చెప్పడానికి. ఇంగ్లాండ్‌ సిరీస్‌ మొత్తం మీద టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి అతడు రెండుసార్లు మాత్రమే టాస్‌ గెలవగలిగాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ అతడికి అదృష్టం కలిసి రాలేదు. మోర్గాన్‌ స్థానంలో వచ్చిన బట్లర్‌ను వరించిన టాస్‌.. విరాట్‌ను మరోసారి నిరాశ పరిచింది.

ఇంగ్లాండ్‌తో టెస్టులు, టీ20ల్లోనూ కోహ్లీకి టాస్‌ ప్రతికూల ఫలితాలే ఇస్తోంది. టెస్టుల్లో ఒకసారి, టీ20ల్లో ఒకసారి మాత్రమే అతను టాస్‌ గెలిచాడు. ఒక్క ఇంగ్లాండ్‌పైనే అన్ని ఫార్మాట్లలో కలిసి అతడు 35 సందర్భాల్లో ఎనిమిది టాస్‌లు మాత్రమే గెలిచాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతడిని దురదృష్టం ఎలా వెంటాడుతోందో!

మొత్తంగా 200 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు సారథ్యం వహించిన కోహ్లీ 115 సార్లు టాస్‌ ఓడి.. 85 సార్లు మాత్రమే నెగ్గాడు. అతని కెరీర్‌ టాస్‌ గెలుపు 45 శాతమే. ఈ విషయంలో మిగిలిన అంతర్జాతీయ కెప్టెన్లందరిలోనూ అతడిదే చివరి స్థానం. గతంలో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ తనకు టాస్‌ ఎంతకీ కలిసి రాకపోవడం వల్ల ఒక మ్యాచ్‌లో సహచర ఆటగాడు డుమినితో టాస్‌ వేయించి నెగ్గాడు. ఇప్పుడు కోహ్లీ కూడా ఇలా చేయాలేమోనని అభిమానులు అంటున్నారు. షోలే సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ రెండు వైపులా ఒకేలా ఉండే నాణాన్ని ఉపయోగించి ప్రతిసారీ తానే నెగ్గుతుంటాడు. ఇప్పుడు టాస్‌ గెలవాంటే కోహ్లీ కూడా ఇలాగే చేయాలేమో అని జోకులు పేలుస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.