ETV Bharat / sports

సతీమణితో పాత జ్ఞాపకాన్ని పంచుకున్న కోహ్లీ - anushka sharma news latest news

లాక్​డౌన్​తో దొరికిన తీరిక సమయంలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్​కు​ ముందు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఇన్​స్టాలో అప్పటి ఫొటోను పంచుకున్నాడు.

Virat Kohli Shares Throwback Picture With His "One And Only" Anushka Sharma
కరోనా ముందునాటి జ్ఞాపకాలతో టీమ్​ఇండియా సారధి
author img

By

Published : Jun 22, 2020, 9:54 PM IST

లాక్​డౌన్​ కారణంగా అనేక రంగాలతో పాటు క్రీడాకారులకూ తీరిక సమయం దొరికింది. ఈ క్రమంలోనే భార్య అనుష్క శర్మతో ముంబయిలోని నివాసంలో గడుపుతున్న విరాట్​ కోహ్లీ.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. కరోనా వైరస్​ వ్యాప్తి ముందు గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తు చేసుకుంటూ.. అప్పటి ఫొటోను ఇన్​స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో టీమ్​ఇండియా సారథి, నటి అనుష్కతో కలిసి ఓ సరస్సు ఒడ్డున కూర్చొని కనిపించాడు.

"ప్రకృతిలో ఇలాంటి అందమైన ప్రదేశాలకు మీరు ఎప్పుడు వెళ్లారో గుర్తు తెచ్చుకోండి. కలిసి కూర్చొని అన్నింటినీ మర్చిపోవడం జరిగేది ఒక్క నా ప్రేమ (అనుష్క శర్మ)తోనే సాధ్యం."

-విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లీ.. సోషల్​ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. తోటి క్రీడాకారులతో ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​ సెషన్లలో పాల్గొంటున్నాడు. కరోనా వైరస్​తోపాటు, గృహ హింస, జంతు హింస వంటి సమస్యలపై సామాజిక మాధ్యమాల వేదికగా అవగాహన కల్పిస్తున్నాడు. వ్యాయామంపైనా అందరూ దృష్టి సారించేలా.. కసరత్తుల వీడియోలను పోస్ట్​ చేస్తుంటాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.