ప్రపంచ క్రికెట్ల్లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన విరాట్.. తాజాగా ఇన్‌స్టాలో వేయి పోస్టుల మైలురాయిని అందుకున్నాడు. గురువారం చేసిన ఈ రికార్డు పోస్టులో అభిమానులపై ప్రశంసలు కురిపించాడు. వారి ప్రేమ, మద్దతును కొనియాడాడు. ఆగస్టులో ఈ స్టార్ బ్యాట్స్‌మన్ 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకోనున్నాడు.
"2008 నుంచి 2020... ఈ కాలంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఇదిగో నా 1000వ పోస్టు" అని కోహ్లీ ఓ ఫొటోషాప్ ఇమేజ్ను షేర్ చేశాడు. అందులో తొలినాళ్లలో కోహ్లీ.. ప్రస్తుత కోహ్లీకి ఫిస్ట్ బంప్ ఇస్తూ కనిపించాడు. ఆ విధంగా ఒకే పిచ్‌పై ఇద్దరు కోహ్లీలు సందడి చేస్తున్నారు.
.
ఇప్పటికే ఇన్‌స్టాలో ఎక్కువ మంది అభిమానులున్న సెలబ్రిటీల్లో ఒకడిగా ఉన్నాడు కోహ్లీ. 69.4 మిలియన్ ఫాలోవర్లనూ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఎక్కువ ఆర్జిస్తున్న టాప్-10 జాబితాలోనూ ఉన్నాడు.
పరుగుల రారాజు..
2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఇప్పటివరకు 86 టెస్టుల్లో 7240 పరుగులు, 248 వన్డేల్లో 11867 రన్స్, 82 టీ20 మ్యాచ్‌ల్లో 2784 పరుగులు చేశాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. వన్డేల్లో టాప్-1 ర్యాంక్, టెస్టుల్లో 2వ ర్యాంక్, టీ20ల్లో టాప్-10లోనూ ఉన్నాడు. ఇప్పటికే కెరీర్లో 70 అంతర్జాతీయ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 27 టెస్టుల్లో చేయగా.. 43 వన్డేల్లో సాధించాడు. గతేడాది కోహ్లీ సారథ్యంలోనే ఆస్ట్రేలియాను అదే గడ్డపై ఓడించి టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది భారత్.