ETV Bharat / state

ఫారిన్ వెళ్లి చదువుకునే వారికి గుడ్​న్యూస్ - డబుల్ కానున్న స్కాలర్​షిప్స్!

ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఏటా 2వేల 3 వందల మంది విద్యార్థులకు మేలు - ఈ పథకంలో రూ. 20లక్షల ప్రోత్సాహంతో పాటు విమాన ఛార్జీలు

SC, ST, BC WELFARE DEPARTMENTS
OVERSEAS EDUCATION SCHOLARSHIPS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 1:34 PM IST

Overseas Scholarships in TG : విదేశీ విద్య ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు త్వరలోనే భారీ ఊరట కలగనుంది. రాష్ట్రంలో ఈ పథకం కింద అందిస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అందిస్తున్న వాటికి దాదాపు రెండింతలకు పైగా చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సంక్షేమ శాఖలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వర్గాల్లో ఏటా 11వందల 10 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్య ఉపకార వేతనాలు అందుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపితే ఆ సంఖ్య 23వందలకు చేరే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఏటా స్ప్రింగ్‌ సీజన్‌కు మార్చిలో, ఫాల్‌ సీజన్‌కు అక్టోబరులో దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేస్తున్నాయి. లబ్ధిదారులకు రెండు విడతలల్లో (ఏడాదికి రూ.10 లక్షలు) రూ.20 లక్షల స్కాలర్​షిప్​, విమాన ఛార్జీలు, వీసా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది.

అప్పులు చేసి వీసాలు పొంది : గతంలో స్కాలర్‌షిప్‌ మంజూరయ్యాక విద్యార్థులు వీసాలకు దరఖాస్తు చేస్తున్నారు. వివిధ కారణాలతో కొందరి వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో వీసాలు పొందిన విద్యార్థులే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వం ఉపకార వేతనం మంజూరు చేస్తుందన్న నమ్మకంతో కొందరు అప్పులు చేసి మరి వీసాలు పొంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు.

ఇక్కడ దరఖాస్తు చేసినా మంజూరు సంఖ్య తక్కువగా ఉండటంతో తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించాలని, అర్హుల్లో అత్యధికులకు విదేశీ విద్య అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది.

ఏ సంక్షేమ శాఖలో ఎంతమంది

  • ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం ఏటా 210 మందికి విదేశీ విద్య పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దరఖాస్తుల సంఖ్య దాదాపు పది రెట్లకుపైగా ఉంటోంది. ఇక నుంచి లబ్ధిదారుల సంఖ్యను 500కు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు.
  • ఎస్టీ సంక్షేమ శాఖలో ఏడాదికి 100 మందినే ఎంపిక చేస్తున్నారు. లబ్ధిదారులను 500కు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
  • బీసీలకు ఏడాదికి కేవలం 3వందల స్కాలర్‌షిప్‌లు మాత్రమే అందుతున్నాయి. దరఖాస్తుదారులు మాత్రం ఆరు వేలకుపైనే ఉంటున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్యను 8వందలకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని, తద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని బీసీ సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది.
  • మైనార్టీల్లో అత్యధికంగా 5వందల మందికి ఉపకార వేతనాలు అందుతున్నాయి.

విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Education Loans For Studying Abroad

డిగ్రీ, పీజీ విద్యార్థులకు బంపర్​ ఆఫర్ - SBI ఉచిత స్కాలర్​షిప్స్ - ఇలా అప్లై చేసుకోండి! - SBI Foundation Scholarship 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.