ETV Bharat / offbeat

వాషింగ్​ మెషిన్​ వాడేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? - త్వరలోనే రిపేరింగ్​ షాప్​కి వెళ్లడం పక్కా!

వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఈ తప్పులు చేయకండి - లేదంటే అది త్వరగా పాడవ్వడం గ్యారంటీ అంటున్న నిపుణులు!

Avoid These Washing Machine Mistakes
HOW TO USE WSHING MACHINE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Avoid These Washing Machine Mistakes : నేటి టెక్నాలజీ యుగంలో ఇంటి పనిని సులువు చేసేందుకు మహిళల సౌకర్యం కోసం ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిల్లో ఒకటి వాషింగ్ మెషిన్. అయితే, వాషింగ్​ మెషిన్​లో బట్టలు ఉతకడమే కాకుండా.. దాన్ని సరిగా వాడుతున్నామో లేదో కూడా గమనించుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఖరీదైన వాషింగ్ మెషిన్ త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంతకీ, వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సరైన ప్రదేశంలో ఉంచకపోతే.. బట్టలు ఉతికేటప్పుడు చాలా మంది వాషింగ్ మెషిన్ సరైన ప్రదేశంలో ఉందా? లేదా? అని చెక్ చేసుకోకుండా వాడేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు మెషిన్ వాలుగా, ఎగుడు దిగుడుగా ఉన్నా పట్టించుకోరు. అయితే, బట్టలు ఉతికేటప్పుడు మెషిన్​ ఎప్పుడూ అలా ఉండకుండా.. సమాన ఉపరితలంపై ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వాలుగా, ఎగుడుదిగుడుగా ఉంటే మెషిన్​పై తీవ్ర ఒత్తిడి పడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందట. అలాగే వాషింగ్ మెషిన్ ఆకారం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు.

శుభ్రంగా ఉంచకపోవడం : వాషింగ్‌ మెషీన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే అక్కడ చేరిన మురికి మెషీన్‌ని పాడు చేయడంతో పాటు మనకీ అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుందంటున్నారు. అందుకే కనీసం ప్రతి ఇరవై రోజులకోసారైనా నీళ్లలో బ్లీచింగ్‌ లేదా వంటసోడా వేసి ఖాళీగా తిప్పితే సరి. ఇలా చేయడం వల్ల లోపల క్రిమిరహితంగా మారుతుందని చెబుతున్నారు.

మీ వాషింగ్​ మెషిన్​ను ఇలా క్లీన్​ చేయండి - దుర్వాసన పోవడంతోపాటు, బట్టలు చక్కగా వాష్​ అవుతాయి!

ఒకేసారి ఎక్కువ దుస్తులు : కొంతమంది త్వరగా పని అయిపోవాలనో ఇంకేదైనా కారణం చేతనో ఒకేసారి ఎక్కువ బట్టలు వాషింగ్​ మెషిన్​లో వేస్తుంటారు. కానీ, మీరు చేసే ఈ చిన్న పొరపాటు మెషిన్ దెబ్బతినడానికి కారణమవుతుందంటున్నారు. ఎందుకంటే ఎక్కువ బట్టలు వేయడం వల్ల మెషిన్​పై అధిక భారం పడి త్వరగా మోటార్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, ఎప్పుడైనా సరే మీ మెషిన్ కెపాసిటీని బట్టి దుస్తులు వాషింగ్​కి వేసుకోవడం, ఎక్కువ ఉంటే రెండు మూడుసార్లు వాష్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే, కొందరు వాషింగ్​ మెషిన్​లో బట్టలు ఉతికాక ఆ తడి బట్టలను ఎక్కువ సేపు మెషిన్​లోనే ఉంచుతుంటుంటారు. ఇదీ మెషిన్​ను డ్యామేజ్ చేస్తుందంటున్నారు.

చెక్ చేయకుండా వేయడం : కొందరు వాషింగ్ మెషిన్​లో బట్టలు వేసేటప్పుడు వాటిల్లో ఏమైనా వస్తువులు ఉన్నాయేమో చెక్ చేయకుండా వేసేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ప్యాంట్లలో నాణాలు, పిన్‌లు, టూత్ పిక్ వంటివి ఉండిపోతాయి. అప్పుడు అవి వాషింగ్ మెషిన్ అంతర్గత భాగాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మెషిన్​లో బట్టలు వేసే ముందు జేబులు చెక్ చేసి వేయడం మంచిదంటున్నారు.

ఎక్కువ డిటర్జెంట్లు : వాషింగ్ మెషిన్ త్వరగా దెబ్బతినకుండా ఎక్కువ రోజులు రావాలంటే బట్టలు వాష్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ డిటర్జెంట్లు వాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మెషిన్స్ కొంతవరకే నీటి, శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, మీరు అలాంటి టైమ్​లో ఎక్కువ డిటర్జెంట్ వాడితే అందులో విడుదలయ్యే నీటి ద్వారా మొత్తం డిటర్జెంట్ శుభ్రం చేయబడదు. దాంతో అది తర్వాత యంత్రంలోనే గడ్డకడుతుంది. దీనివల్ల క్రమంగా మెషిన్ మోటారు జామ్ అవుతుంది. అప్పుడు రిపేరింగ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

వాషింగ్​ మెషీన్​లో బట్టలు మాత్రమే కాదు - ఇవి కూడా క్లీన్​ చేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.