రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ పట్టిన ఓ క్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అద్భుత క్యాచ్‌గా నిలిచిపోయింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద నిల్చున్న ఏబీడీ.. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. సూపర్‌మ్యాన్ ఫీట్‌ను తలపించిన ఈ క్యాచ్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.
అయితే తాజాగా ఈ సూపర్ క్యాచ్‌ను ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ రీ క్రియేట్ చేశాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో అచ్చం ఏబీడీలానే బౌండరీ లైన్ వద్ద నిలబడి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఏబీడీ సూపర్ క్యాచ్‌తో పోలుస్తూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. 'కెప్టెన్ కోహ్లీ మాములుగానే ఏబీ సూపర్‌మ్యాన్ క్యాచ్ రీక్రియేట్ చేశాడు. గత సాయంత్రం ప్రాక్టీస్ సెషన్‌లో ఇలా బంతిని అందుకున్నాడు' అని వ్యాఖ్య రాసుకొచ్చింది.
ఆర్సీబీ తన తొలి మ్యాచ్ సెప్టెంబరు 21(సోమవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
-
Captain Kohli casually recreating AB’s ‘Superman’ catch in training last evening. 😎 🦸🏻♂️#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/E5YcdIjxiM
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Captain Kohli casually recreating AB’s ‘Superman’ catch in training last evening. 😎 🦸🏻♂️#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/E5YcdIjxiM
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2020Captain Kohli casually recreating AB’s ‘Superman’ catch in training last evening. 😎 🦸🏻♂️#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/E5YcdIjxiM
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2020
ఇదీ చూడండి చెన్నై సూపర్‌కింగ్స్‌కు రైనా ఆల్‌ది బెస్ట్