ETV Bharat / sports

విరాట్​కు వయసే కాదు ఆటలో పదునూ పెరుగుతోంది..! - virat kohli

చిన్నవయసులోనే కెరీర్​లో మరపురాని రికార్డులు కైవసం చేసుకున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ. 31 ఏళ్లకు కలిస్​, పాంటింగ్​కు దక్కని ఘనతను ఇదే వయసుకు విరాట్​ సాధించడం విశేషం.

విరాట్​కు వయసుతో పాటు విజృంభణా పెరుగుతోంది!
author img

By

Published : Nov 5, 2019, 3:38 PM IST

Updated : Nov 5, 2019, 4:08 PM IST

విరాట్ కోహ్లీ.. అసామాన్య ప్రతిభకు నిదర్శనం.. నేటితో 31 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ తన క్రికెట్​ కెరీర్​లో ఎన్నో రికార్డులు వశం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి పాంటింగ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్​ కలిస్​ లాంటి దిగ్గజాలు ఈ వయసుకు అంతర్జాతీయ క్రికెట్​లో విరాట్​ కంటే వెనుకంజలోనే ఉండటం గమనార్హం.

31 ఏళ్లకు విరాట్ అన్ని అంతర్జాతీయ మ్యాచ్​ల్లో 57 సగటుతో మొత్తం 21 వేల 36 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు లిటిల్​ మాస్టర్​ సచిన్ తెందూల్కర్ ఉన్నాడు. 31 ఏళ్ల వయసుకు.. సచిన్​ 49.1 సగటుతో 23వేల 776 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో పాంటింగ్(18,858), కలిస్​(18,030), డివిలియర్స్ (17,882) ఉన్నారు.

virat kohli records in batting average
విరాట్ అత్యధిక పరుగులు

ఏటా పెరుగుతున్న పరుగుల ప్రవాహం..

ఏ పనిలోనైనా వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరుగుతుంది. ఆ రంగంలో ఇంకా మేటిగా తయారవుతారు. కానీ క్రీడల్లో మాత్రం అనుభవం పెరిగినా.. మునుపటి దూకుడు, ప్రదర్శన చాలా మంది ఆటగాళ్లలో తగ్గుతుంది. ఇందుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మినహాయింపు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ.. తన బ్యాటింగ్​లో పదును పెరిగింది. ఇంకా మెరుగుపడుతూ వస్తోంది. అందుకు అతడి బ్యాటింగ్ సగటే ఉదాహరణ.

గత ఆరేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్​ల్లో తన సగటును పెంచుకుంటూ వెళ్తున్నాడు కోహ్లీ. తనకు 26 ఏళ్లప్పుడు 47.69 సగటుతో ఆకట్టుకున్న విరాట్​ 31 ఏళ్లు వచ్చేసరికి 57కు పెంచుకున్నాడు. ఏటా.. అద్భుత ప్రదర్శనలతో పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఇదీ చదవండి: కోహ్లీకి అనుష్క బహుమతి.. భూటాన్​లో విహారయాత్ర

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 5, 2019, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.