ETV Bharat / sports

అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఉంది: కోహ్లీ - kohli sunil chetthri news

టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​పై కెప్టెన్​ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత ఫుట్​బాల్​ ప్లేయర్​ సునీల్​ ఛెత్రీతో పాల్గొన్న లైవ్​ సెషన్​లో 1998 షార్జా వేదికగా జరిగిన కోకాకోలా కప్​ సిరీస్​లో సచిన్​ ప్రదర్శనను గుర్తు చేసుకున్నాడు.

Virat Kohli picks Sachin Tendulkar's this iconic innings he wishes he played
సచిన్​ లాప్​ షాట్​ను నేను అనుకరిస్తా: కోహ్లీ
author img

By

Published : May 18, 2020, 5:42 PM IST

భారత దిగ్గజ బ్యాట్స్​మన్​ సచిన్​ తెందూల్కర్​పై టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. 1998లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా కప్​ సిరీస్​లో భారత్​ విజయంలో కీలకపాత్ర పోషించాడని కొనియాడాడు. ఆదివారం భారత ఫుట్​బాల్​ ప్లేయర్ సునీల్​ ఛెత్రీతో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. వీరిద్దరూ కలిసి మైదానం లోపల, వెలుపల విషయాలను చర్చించుకున్నారు. షార్జా వేదికగా 1998లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్​ను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు కోహ్లీ.

ఛెత్రీ: అంతర్జాతీయ క్రికెట్‌లో మీరు ఆడాలని కోరుకునే మ్యాచ్​ ఏది?

కోహ్లీ: 1998 సాండ్ స్ట్రోమ్​ మ్యాచ్​.

ఛెత్రీ: సెమీ-ఫైనల్ మ్యాచ్​.. ఫైనల్​ మ్యాచ్​ల్లో ఏది?

కోహ్లీ: ఫైనల్​కు అర్హత సాధించిన మ్యాచ్.

Virat Kohli picks Sachin Tendulkar's this iconic innings he wishes he played
కోకాకోలా కప్​ సిరీస్​లో సచిన్​ తెందుల్కర్​

22 ఏళ్ల క్రితం షార్జా వేదికగా కోకాకోలా కప్​ సెమీఫైనల్​లో 131 బంతుల్లో 143 పరుగులు సాధించి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు సచిన్. ఆ మ్యాచ్​లో ప్రత్యర్థి గెలిచినా.. తుది పోరులో అదే ఆటతీరుతో ఆసీస్​ ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్​లో సచిన్ ఆడిన ల్యాప్ షాట్​ తనను చాలా ఆకట్టుకుందని.. దాన్ని కచ్చితంగా అనుకరిస్తానని కోహ్లీ అన్నాడు.

ఇదీ చూడండి.. 'క్రికెటర్ల శిక్షణా శిబిరాలపై త్వరలోనే నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.