భారతీయ అథ్లెట్లకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని దాని కోసం కష్టపడాలని సూచించాడు విరాట్ కోహ్లీ. ఇందుకోసం శాకాహారం బాగా ఉపయోగపడుతుందని చెప్పాడీ స్టార్ బ్యాట్స్‌మెన్. మాంసాహారం తినడం వల్ల క్రీడాకారుల సామర్థ్యం పెరుగుతుందని అంతా భావిస్తారు. అదంతా అపోహ అని పేర్కొన్నాడు కోహ్లీ. తన ఆహారపు అలవాట్లు మారిన తర్వాతే ఆట తీరు మెరుగైందని చెప్పుకొచ్చాడీ రన్‌మెషీన్. తాజాగా దానిపై ఓ ట్వీట్‌నూ చేశాడు.
" నెట్‌ఫ్లిక్స్‌లో గేమ్ ఛేంజర్స్ అనే డాక్యుమెంటరీ చూశాను. శాకాహారిగా ఉన్న నాకు అది ఎంతో పాఠం నేర్పింది. ఇన్ని రోజులు డైట్ విషయంలో నేను పాటించే విషయాలు తప్పని తెలుసుకున్నా.గతంలో మాంసాహారిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నంత ఉత్తమంగా ఫీలవ్వలేదు".
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
-
Saw game changers on Netflix. Being a vegetarian athlete has made me realise what I have believed all these years regarding diet was a myth. What an amazing documentary and yes I’ve never felt better in my life after I turned vegetarian.
— Virat Kohli (@imVkohli) October 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Saw game changers on Netflix. Being a vegetarian athlete has made me realise what I have believed all these years regarding diet was a myth. What an amazing documentary and yes I’ve never felt better in my life after I turned vegetarian.
— Virat Kohli (@imVkohli) October 23, 2019Saw game changers on Netflix. Being a vegetarian athlete has made me realise what I have believed all these years regarding diet was a myth. What an amazing documentary and yes I’ve never felt better in my life after I turned vegetarian.
— Virat Kohli (@imVkohli) October 23, 2019
'ద గేమ్ ఛేంజర్స్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇందులో ఓ ఇంగ్లీష్ మార్షల్ ఆర్టిస్ట్ మాంసం, ప్రోటీన్లు, బలం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులను కలిసి ఓ అధ్యయనం చేస్తాడు.
భార్య వల్లేనా..!
సాధారణంగా మాంసం, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులను ఆహారంలో తీసుకోవడం విరాట్‌కి అలవాటు. అయితే శాకాహారిగా మారిన ఈ ఆటగాడు... ప్రోటీన్ షేక్, కూరగాయలు, సోయా మాత్రమే తింటున్నాడు. తనకి ఎంతో ఇష్టమైన మాంసాహార భోజనాన్ని దూరం పెట్టాడు. ముఖ్యంగా బిరియానీ, బటర్ చికెన్, ఛోలే బతురే వంటి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని విడిచిపెట్టాడు. అయితే మూడేళ్ల క్రితమే కోహ్లీ భార్య అనుష్క శర్మ శాకాహారిగా మారడమే.. కోహ్లీని అటువైపు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.
-
But seriously, I just watched this film and it’s an eye-opener... helps you a great deal related to understanding fitness and beyond.
— Anushka Sharma (@AnushkaSharma) October 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
If you guys want to check it out, here’s the trailer : https://t.co/AxZlxJZU3r
Love and light always !
">But seriously, I just watched this film and it’s an eye-opener... helps you a great deal related to understanding fitness and beyond.
— Anushka Sharma (@AnushkaSharma) October 22, 2019
If you guys want to check it out, here’s the trailer : https://t.co/AxZlxJZU3r
Love and light always !But seriously, I just watched this film and it’s an eye-opener... helps you a great deal related to understanding fitness and beyond.
— Anushka Sharma (@AnushkaSharma) October 22, 2019
If you guys want to check it out, here’s the trailer : https://t.co/AxZlxJZU3r
Love and light always !
దక్షిణాఫ్రికాపై ఇటీవలే 3-0 తేడాతో టెస్టు సిరీస్ గెలుచుకుంది టీమిండియా. సఫారీలను వైట్‌వాష్ చేసిన కోహ్లీ సేన... అజారుద్దీన్ (3) సారథ్యం తర్వాత ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్ చేసిన కెప్టెన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు.