భారత క్రికెట్‌లో రోహిత్, కోహ్లీకి రికార్డులంటే లెక్కేలేదు. అలవోకగా రన్స్ చేస్తూ మ్యాచ్ స్వరూపాలను మార్చేస్తుంటారు. అయితే వీరిద్దరి మధ్య గతేడాది నుంచి ఓ రికార్డు దోబూచులాడుతోంది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక పరుగులు వీరుడి స్థానం కోసం వీళ్లిద్దరూ పోటీపడుతూనే ఉన్నారు. గతేడాది టెస్టుల్లోనూ సమానమైన పరుగులు చేసిన వీళ్లు.. తాజాగా ఈ రికార్డు వేటలోనూ రేసులో ఉన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 2783 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 2713 రన్స్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో మరో రెండు టీ20లు బాకీ ఉన్నాయి. వీటిలో హిట్‌మ్యాన్ ఫామ్ నిరూపిస్తే ఈ రికార్డు మళ్లీ మారే అవకాశముంది.
![virat kohli, rohit sharma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5899406_t20record.jpg)
మహీని దాటేశాడు..
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఇటీవలే అధిగమించాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సారథిగా విరాట్ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా... కింగ్ కోహ్లీ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో ఇష్ సోథి వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని సింగిల్ సాధించి ఈ మైలురాయి అందుకున్నాడు విరాట్. ఈ క్రమంలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన మాజీ సారథి ఎంఎస్ ధోనీ(1112) రికార్డు బ్రేక్ అయింది. మొత్తంగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా సారథి డూప్లెసిస్(1273), కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(1148) రన్స్‌తో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
-
Another day at office. Another record for #KingKohli 👑 pic.twitter.com/k9BmqtugWf
— BCCI (@BCCI) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another day at office. Another record for #KingKohli 👑 pic.twitter.com/k9BmqtugWf
— BCCI (@BCCI) January 29, 2020Another day at office. Another record for #KingKohli 👑 pic.twitter.com/k9BmqtugWf
— BCCI (@BCCI) January 29, 2020
పదివేల క్లబ్లో హిట్‌మ్యాన్..
ఇదే మ్యాచ్‌లో టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. ఇది రోహిత్‌కు కెరీర్లో 24వది. ఈ ప్రదర్శనతో టీ20ల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన ఆటగాడిగా సారథి విరాట్ కోహ్లీ సరసన చేరాడు హిట్‌మ్యాన్.
అంతేకాకుండా పదివేల పరుగుల క్లబ్‌లోనూ చేరాడు రోహిత్. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మట్లలో కలిపి పది వేల పరుగులు సాధించిన నాలుగో టీమిండియా ఓపెనర్‌గా ఘనత సాధించాడు. భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఫీట్ ఖాతాలో వేసుకున్నాడు హిట్‌మ్యాన్.
-
Milestone Alert - Rohit Sharma now has 10K international runs as an opener 👏👏
— BCCI (@BCCI) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
HITMAN on the go 💪 pic.twitter.com/cVUXdOeWut
">Milestone Alert - Rohit Sharma now has 10K international runs as an opener 👏👏
— BCCI (@BCCI) January 29, 2020
HITMAN on the go 💪 pic.twitter.com/cVUXdOeWutMilestone Alert - Rohit Sharma now has 10K international runs as an opener 👏👏
— BCCI (@BCCI) January 29, 2020
HITMAN on the go 💪 pic.twitter.com/cVUXdOeWut