ఈ దశాబ్దంలో విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఈ ఏడాది విడుదల చేసిన ప్రతిష్టాత్మక విజ్డెన్ జట్లన్నింటిలో కోహ్లీ పేరుంది. తాజాగా విజ్డెన్ ఈ దశాబ్దపు టీ20 జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి కోహ్లీతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
అయితే ఈ జట్టులో టీమిండియా స్టార్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా స్థానం సంపాదించి ఔరా అనిపించాడు.
ఇప్పటికే విజ్డెన్.. ఈ దశాబ్దపు వన్డే,టెస్టు జట్లను ప్రకటించింది. ఈ రెండింటిలోనూ కోహ్లీ పేరుంది. దశాబ్దపు ఐదుగురు ఉత్తమ క్రికెటర్ల జాబితాలోను చోటు సంపాదించాడు విరాట్. ఇందులో కోహ్లీతో పాటు డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్, మహిళా ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ ఉన్నారు.
విజ్డెన్ టీ20 జట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కొలిన్ మున్రో, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్, జాస్ బట్లర్, మహ్మద్ నబీ, డేవిడ్ విల్లే, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
ఇవీ చూడండి.. హారతి సన్నివేశం చూసి టీవీ పగలకొట్టా: అఫ్రిదీ