విరాట్ కోహ్లీ... తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. అవకాశమొస్తే చాలు చెలరేగిపోయే ఈ బ్యాట్స్‌మెన్... ఓ రికార్డు బ్రేక్ చేసేందుకు మాత్రం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
The runs continue to flow.
— ICC (@ICC) October 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli has passed his Test best.#INDvSA pic.twitter.com/7OT6sr2Oau
">The runs continue to flow.
— ICC (@ICC) October 11, 2019
Virat Kohli has passed his Test best.#INDvSA pic.twitter.com/7OT6sr2OauThe runs continue to flow.
— ICC (@ICC) October 11, 2019
Virat Kohli has passed his Test best.#INDvSA pic.twitter.com/7OT6sr2Oau
ఆ ఒక్కటి...
ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. 6 జట్లపై ద్విశతకాలు చేసిన మూడో క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గానూ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు కుమార సంగక్కర(శ్రీలంక), యునిస్ఖాన్(పాకిస్థాన్) ఈ జాబితాలో ఉన్నారు. వీరిద్దరూ గతంలో వివిధ జట్లపై 6 డబుల్ సెంచరీలు చేశారు.
ఇప్పటికే టెస్టుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌పై ద్విశతకాలు సాధించాడు రన్ మెషీన్. కాని ఆస్ట్రేలియాపై మాత్రమే ఈ రికార్డు సాధించలేదు. కంగారూ జట్టుపై ఇప్పటివరకు విరాట్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 169. దీనిని అధిగమించాలంటే రెండే అవకాశాలున్నాయి.
- 2020 నవంబర్-డిసెంబర్లో కంగారూ గడ్డపై భారత్ 4 టెస్టుల సిరీస్ ఆడనుంది. కోహ్లీకి దగ్గరలో ఉన్న తొలి అవకాశమిదే.
- స్వదేశంలో 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఉంది.
2016లో తొలి డబుల్...
2016లో ఆంటిగ్వా వేదికగా విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించాడు కోహ్లీ. తన 42వ టెస్టులో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు. మొదటి రికార్డుకు 42 టెస్టులు తీసుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్... ఆ తర్వాత 40 టెస్టుల వ్యవధిలోనే ఏడు ద్విశతకాలు చేశాడు. 2016 నుంచి ఇప్పటివరకు ప్రపంచ కికెట్లో మరే బ్యాట్స్‌మన్ కూడా రెండుకు మించి డబుల్ సెంచరీలు చేయలేదు.
గత మూడేళ్లలో అజహర్ అలీ, అలిస్టర్ కుక్, స్టీవ్ స్మిత్ రెండేసి ద్విశతకాలతో కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ వ్యవధిలో భారత బ్యాట్స్‌మెన్ అంతా కలిసి మూడు డబుల్ సెంచరీలే సాధించారు.
15 సార్లు బ్రేక్ ...
ఈ మ్యాచ్‌లో తన కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన కోహ్లీ... 15వ సారి తన రికార్డును బద్దలు కొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.