మరికొన్ని రోజుల్లో 13వ ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ట్విట్టర్‌లో సరదాగా చాటింగ్ చేశారు. వాట్సాప్‌లో చేసినట్లు చాట్ చేయడం గమనార్హం. వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
ఏబీ: కోహ్లీ ఏం చేస్తున్నావ్?
కోహ్లీ: టీవీ చూస్తూ సేదతీరుతున్నా (రెండు ఎమోజీలు).
ఏబీ: బర్నింగ్ క్రాకర్ (ఎమోజీ).
కోహ్లీ: ???
ఏబీ: ఇంట్లో కూర్చోకుండా వెళ్లి ప్రాక్టీస్ మొదలెట్టు (అనే అర్థంతో కూడిన వీడియో).
కోహ్లీ, డివిలియర్స్ లాంటి కీలక ఆటగాళ్లున్న ఆర్సీబీ ఇప్పటి వరకు టైటిల్ సాధించలేదు. ప్రతిసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం.. తర్వాత చతికిల పడడం సర్వసాధారణమైంది. దీంతో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది.
కోహ్లీ ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో పూర్తిగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఫామ్ సాధించి ఐపీఎల్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా అతడికి మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడాలని ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి జట్టులోకి వచ్చే ప్రయత్నాలు జరగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 31న ఆర్సీబీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.