ETV Bharat / sports

తెవాతియా విధ్వంసం.. రెచ్చిపోయిన సూర్యకుమార్​ - విజయ్​ హజారే ట్రోఫీ

యువ బ్యాట్స్​మెన్లు రాహుల్​ తెవాతియా, సూర్యకుమార్​ యాదవ్​లు.. విజయ్​ హజారే టోర్నీలో సత్తాచాటారు. టీ20ని తలపిస్తూ విధ్వంసకర బ్యాటింగ్​ చేశారు. ముంబయి తరఫున పృథ్వీ షా, మహారాష్ట్ర టీంలో రుతురాజ్​ గైక్వాడ్​లు సెంచరీలతో ఆకట్టుకున్నారు.

vijay hazare trophy second day highlights
తెవాతియా విధ్వంసం.. రెచ్చిపోయిన సూర్యకుమార్​
author img

By

Published : Feb 21, 2021, 8:09 PM IST

విజయ్​ హజారే టోర్నీలో యువ బ్యాట్స్​మెన్లు రాహుల్​ తెవాతియా, సూర్యకుమార్ యాదవ్​లు రెచ్చిపోయారు. టీమ్​ఇండియా పొట్టి ఫార్మాట్​కు ఎంపికయ్యామన్న ఆనందాన్ని వారి బ్యాటింగ్​లో చూపెట్టారు. వీరితో పాటు పృథ్వీ షా సెంచరీతో సత్తా చాటాడు.

గ్రూప్​-డీలోని దిల్లీ, ముంబయిల మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబయి జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్​ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్​ సింగ్ శతకంతో ఆకట్టుకోగా.. శివ్​కాంత్​ వశిష్ఠ్​ అర్ధ సెంచరీతో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ముంబయి 31.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పృథ్వీ షా 89 బంతుల్లోనే 105 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్​ 33 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

సంక్షిప్త స్కోర్లు:

దిల్లీ: 211/7, 50 ఓవర్లు. (హిమ్మత్​ సింగ్​ 106, శివ్​కాంత్​ వశిష్ఠ్​ 55, ధవళ్​ కులకర్ణి 35/3, శామ్స్​ ములాని 33/2)

ముంబయి: 216/3, 31.5 ఓవర్లు. (పృథ్వీ షా 105, సూర్యకుమార్ యాదవ్​ 50, లలిత్​ యాదవ్​ 32/2)

హరియాణా, చండీగఢ్​ల మధ్య జరిగిన మరో మ్యాచ్​లో రాహుల్ తెవాతియా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత బ్యాటింగ్​కు దిగిన హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేసింది. ఓపెనర్​ హిమాన్ష్​ రాణా సెంచరీకి తోడు అరుణ్​ చప్రానా, రాహుల్​ తెవాతియాలు హాఫ్​ సెంచరీలు చేశారు. అటు బంతితోనూ రాహుల్​ రాణించినప్పటికీ అతని జట్టు ఓటమి పాలైంది. చండీగఢ్​ టీమ్..​ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మనన్​ వోహ్రా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు అంకిత్​ కౌషిక్​ అర్ధ సెంచరీతో జట్టు విజయానికి సహకరించాడు.

సంక్షిప్త స్కోర్లు:

హరియాణా: 299/9, 50 ఓవర్లు. (హిమాన్ష్​ రాణా 102, రాహుల్​ తెవాతియా 73, జగ్జీత్ సింగ్​ 36/3, గురీందర్​ సింగ్​ 50/2​)

చండీగఢ్​: 300/7, 49.3 ఓవర్లు. (మనన్​ వోహ్రా 117, అంకిత్​ కౌషిక్ 78, రాహుల్​ తెవాతియా 66/2, సుమిత్​ కుమార్ 34/2)

మహారాష్ట్ర, హిమాచల్​ ప్రదేశ్​ల మధ్య జరిగిన మ్యాచ్​లో మహారాష్ట్ర 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 295 పరుగులు చేసింది. రుతురాజ్​ గైక్వాడ్​ మూడంకెల స్కోరు చేశాడు. మరో ఓపనర్​ యష్​ నహర్​ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనకు దిగిన హిమాచల్​ ప్రదేశ్​ 236 పరుగులకే కుప్పకూలింది. 46 పరుగులు చేసిన అభిమన్యు రాణా ఆ జట్టు టాప్​ స్కోరర్. 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రాజ్​వర్ధన్​.

సంక్షిప్త స్కోర్లు:

మహారాష్ట్ర: 295/8, 50 ఓవర్లు. (రుతురాజ్​ గైక్వాడ్​ 102, యష్​ నహర్​ 52, వైభవ్​ అరోరా 45/4, ఆయూష్​ జమ్వాల్ 49/2)

హిమాచల్​ ప్రదేశ్​: 236 ఆలౌట్, 48.3 ఓవర్లు. (అభిమన్యు రాణా 46, అమిత్​ కుమార్ 34, రాజ్​వర్ధన్​ 42/4, సత్యజీత్​ బచ్చావ్​ 46/2)

ఇదీ చదవండి: పింక్​ టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న కోహ్లీ సేన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.