విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న బిహార్ ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో అతని సహచర ప్లేయర్లకూ కొవిడ్ టెస్టులు చేయనున్నారు. ఆ రిపోర్టులు బుధవారం సాయంత్రం రానున్నాయి. ఈ టోర్నీ కోసం బిహార్ 22 మంది క్రికెటర్లను పంపింది.
"బిహార్‌కు చెందిన ఓ ఆటగాడికి వైరస్ నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం అతడు మిగతా క్రికెటర్లకు దూరంగా బెంగుళూరులో ఐసోలేషన్‌లో ఉన్నాడు" అని సీనియర్ అధికారి తెలిపాడు.
ప్రస్తుతం ఎలీట్ గ్రూప్-సీలో ఉన్న బిహార్ జట్టు.. తన లీగ్ మ్యాచ్‌లన్నీ బెంగుళూరులో ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్ బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌తో జరగాల్సి ఉంది. కరోనా కలకలం రేగినా.. మ్యాచ్‌లు యథావిధిగా జరుగుతాయని బిహార్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.
కొవిడ్ అనంతరం బీసీసీఐ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద టోర్నీ ఇదే.
ఇదీ చదవండి: మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా?