చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టుల కోసం భారత ఆటగాళ్లు విడివిడిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి, పుజారా, బుమ్రా, పంత్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, శార్దుల్ ఠాకూర్ చేరుకోగా.. తాజాగా సారథి విరాట్ కోహ్లీ కూడా చెన్నైకు వచ్చేశాడు. ఆటగాళ్లందరూ ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు.
తొలి టెస్టు ఫిబ్రవరి 5న చిదంబరం స్టేడియంలో ఆరంభమవుతుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ కూడా ఇప్పటికే భారత్ వచ్చేసి క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. వారందరికీ చేసిన నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది.
భారత పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది ఇంగ్లీష్ జట్టు. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కరోనా నెగెటివ్