ఇంగ్లాండ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లను గెలిచిన టీమ్ఇండియా వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే నేడు పుణె వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖెల్ వాన్.. భారత జట్టు ఈ సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు.
"నా ముందస్తు అంచనా ప్రకారం భారత్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుస్తుంది. రూట్, ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటు" అంటూ ట్వీట్ చేశాడు వాన్.
-
Early One day series prediction .... India will win 3-0 !!! No Root or Archer ... #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Early One day series prediction .... India will win 3-0 !!! No Root or Archer ... #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) March 22, 2021Early One day series prediction .... India will win 3-0 !!! No Root or Archer ... #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) March 22, 2021
టీమ్ఇండియాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రూట్‌కు చోటు దక్కలేదు. అలాగే స్టార్ పేసర్ ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగుతోంది.
ఇంగ్లాండ్ జట్టు
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, సామ్ కరన్, టామ్ కరన్, లివింగ్‌స్టోన్, మాట్ పర్కిన్సన్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్స, రీస్ టాప్లే, మార్క్ వుడ్
రిజర్వ్ ఆటగాళ్లు
జాక్ బాల్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్