భారత వృద్ధ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ వసంత్ రాయ్‌జీ.. జులై 13న వేకువజామున 2:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతోనే మరణించినట్లు కుమారుడు సుదర్శన్ చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు రాయ్‌జీ. ఆ సమయంలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, స్టీవ్వాలు ఆయన్ను కలిశారు.
బాంబే జింఖానా మైదానంలో టీమ్ఇండియా తొలి టెస్టు ఆడినప్పటి నుంచి ఇప్పటిదాకా జట్టు ప్రయాణాన్ని చూసిన ఏకైక క్రికెటర్ వసంత్. భారత్ తరఫున 1940ల్లో తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈయన.. 68 అత్యధిక స్కోరుతో మొత్తంగా 277 పరుగులు చేశారు.
లాలా అమర్‌నాథ్, విజయ్ మర్చంట్, సీకే నాయుడు, విజయ్ హజారే లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు వసంత్. ముంబయిలోని వాకేశ్వర్ ప్రాంతంలో నివసిస్తున్న ఈయన.. క్రికెట్‌పై కొన్ని పుస్తకాలు కూడా రాశారు. రాయ్‌జీ భార్య పన్నాకు 94 ఏళ్లు.
ఇవీ చదవండి: