శ్రీలంక క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ చమిందా వాస్ తన పదవికి రాజీనామా చేశాడు. మూడు రోజుల కిందటే ఆయన ఈ పదవికి ఎంపిక అయ్యాడు. బోర్డుతో వచ్చిన విభేదాల కారణంగానే వాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ పర్యటన నిమిత్తం లంక జట్టు బయలుదేరే ముందు వాస్ తన రాజీనామాను సమర్పించాడు. "మేము అతని నిబంధనలతో అంగీకరించలేదు.. అందుకే అతడు రాజీనామా చేశాడు" అని శ్రీలంక క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి పేర్కొన్నాడు.
"కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వాస్ తన పారితోషికాన్ని పెంచాలని కోరాడు. అందుకు బోర్డు అంగీకరించలేదు. దీంతో అతడు బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. సోమవారం రాత్రి లంక జట్టు వెస్టిండీస్ బయలుదేరాల్సి ఉంది. ఈ లోపు వాస్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు" అని బోర్డు తెలిపింది.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ సాకర్ స్థానంలో లంక బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్‌ను గత వారమే నియమించింది బోర్డు. కాగా, డేవిడ్ ఆధ్వర్యంలో లంక జట్టు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లలో పేలవ ప్రదర్శన చేసింది.
కాగా.. విండీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 2 టెస్టుల సిరీస్ నిమిత్తం లంక జట్టు ఆ దేశంలో పర్యటించనుంది.
ఇదీ చదవండి: 15 ఏళ్ల తర్వాత శ్రీశాంత్ 5 వికెట్ల ఘనత